సరిపోదా శనివారంతో మరోసారి తెలుగు ప్రేక్షకులని తన నటనతో మంత్ర ముగ్ధులను చేసిన మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ ఎస్ జే సూర్య. తన కెరీర్‌లో ఫుల్ బిజీగా ఉన్నా… వ్యక్తిగత జీవితం మాత్రం ఇప్పటికీ ఓ సున్నితమైన ప్రశ్నగా మిగిలిపోయింది. 57వ పుట్టినరోజును జరుపుకుంటున్న ఈ క్రియేటివ్ సెలబ్రిటీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా పెళ్లి చేసుకోలేదన్న విషయం తెలుసా?

అసలు సూర్య పెళ్లి గురించి ఆలోచించలేదట. ఎందుకంటే – అతని జీవితం అంతా ఒక్కటే లక్ష్యాన్ని చుట్టూ తిరుగుతోంది – “సినిమా”. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు కూడా. “ఇంకా నా టార్గెట్‌ను చేరుకోలేదు, నన్ను నేను సంతృప్తిపర్చుకోలేను. నా లక్ష్యం కోసం ఇప్పటికీ పరిగెడుతున్నాను. అందుకే పెళ్లి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు,” అని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పుడు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విభిన్న పాత్రల్లో నటిస్తూ స్క్రీన్ మీద దూసుకెళ్తున్న ఎస్ జే సూర్య… దర్శకుడిగా కూడా మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నారు. తానే నిర్మిస్తున్న ఓ సినిమాతో మళ్లీ దర్శకత్వానికి రెడీ అవుతున్నారు. ‘వాలి’, ‘ఖుషి’, ‘ఇరైవి’, ‘స్పైడర్’, ‘మెర్సల్’ లాంటి సినిమాల్లో చేసిన ఆయన పాత్రలు ఇప్పటికీ గుర్తుండేలా ఉంటాయి.

రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత కోలీవుడ్‌లో ఉన్న సీనియర్ యాక్టర్ ఎవరు అని ప్రశ్నిస్తే, అభిమానులు ఎస్ జే సూర్య పేరే చెబుతున్నారు. కానీ ఈ శ్రద్ధ అంతా తన పనిపై పెట్టుకున్న ఆయన… పెళ్లి విషయంలో మాత్రం పూర్తిగా నిర్లిప్తంగా ఉండటం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

వాస్తవానికి హీరో కావాలన్న కలతో భాగ్యరాజ్, భారతీరాజా, వసంతన్ వంటి దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించి, తాను ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. ఆ కష్టాల్లో పెళ్లి అనే విషయానికి చోటు దొరకలేదేమో!

,
You may also like
Latest Posts from