రాజమౌళి వంటి స్టార్ డైరక్టర్ సినిమాలో అవకాసం వస్తే ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాల్లో చేసిన వారంతా నెక్ట్స్ లెవిల్ కు వెళ్తారు. అయితే త్రిషకు మాత్రం ఆ ఆఫర్ వచ్చినా వద్దని రిజెక్ట్ చేసిందిట. ఏ సినిమా కోసం, ఎందుకు త్రిష ..రాజమౌళి ఆఫర్ వద్దందో చూద్దాం.
త్రిష వద్దన్న సినిమా మరేదో కాదు మగధీర. రాజమౌళి 2009లో ‘మగధీర’ చిత్రం తర్వాత ‘మర్యాద రామన్న’ తెరకెక్కించారు.
2010లో విడుదలైన ‘మర్యాద రామన్న’ సినిమాలో టాలీవుడ్ స్టార్ కమెడియన్ సునీల్ హీరోగా నటించారు. అయితే ఇందులో ఫీమేల్ లీడ్‌గా నటించే ఛాన్స్‌ను మొదట త్రిషకే ఇచ్చారట.
అయితే అప్పటికే త్రిష స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న నేపథ్యంలో ఆమెను ఎంపిక చేసుకున్నారట రాజమౌళి. అయితే సునీల్ వంటి కమెడియన్ పక్కన హీరోయిన్‌గా నటించడం వల్ల కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందని భావించిన త్రిష జక్కన్న ఆఫర్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో తన స్థానంలో హీరోయిన్‌గా సలోనిని తీసుకున్నారని సమాచారం.
ఆ తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేసిన ఏ సినిమాలోనూ త్రిష ఇప్పటివరకు కనిపించలేదు. ఇటు రాజమౌళి పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే, మరోపక్క వరుస సినిమాలతో త్రిష స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకుంది