స్వలింగ సంపర్కుల ప్రేమకథలు మన సినిమాల్లో వస్తే తెలుగువారు అంగీకరిస్తారా? థియేటర్లలో చూసేందుకు రెడీ అవుతారా? ఇదే ప్రశ్న ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్‌గా మారబోతోంది. కారణం – రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ‘సబర్ బొండా’.

‘కేరాఫ్ కంచరపాలెం’, ‘35 చిన్న కథ కాదు’ లాంటి కథా బలం ఉన్న సినిమాలను ప్రేక్షకులకు దగ్గర చేసిన రానా… ఈసారి మరాఠీ సినిమా ‘సబర్ బొండా’ ను స్పిరిట్ మీడియా ద్వారా విడుదల చేస్తున్నారు. సన్‌డాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి గ్రాండ్ జ్యూరీ అవార్డు గెలుచుకున్న ఈ సినిమా… గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు యువకుల స్వలింగ సంపర్క ప్రేమకథను చూపిస్తుంది. అంతేకాదు – తండ్రీ–కొడుకుల బంధాన్నీ ఇందులో సున్నితంగా ఆవిష్కరించారు.

మొదట అంతర్జాతీయ వేదికపై ‘Cactus Pears’ అనే టైటిల్‌తో ప్రదర్శించబడిన ఈ సినిమా… ఇప్పుడు ఇండియాలో ‘సబర్ బొండా’ పేరుతో రిలీజ్ అవుతోంది. ‘‘ఏడాది క్రితం మా స్పిరిట్ మీడియా పార్ట్‌నర్ ప్రతీక్ష చూసి… ‘మన దగ్గర నుండి వచ్చే తదుపరి సినిమా ఇదే’ అనగానే నేను వెంటనే సరే అన్నాను. దర్శకుడు రోహన్ పరశురామ్ తన కథను నిజాయతీగా చెప్పాడు. ఈ సినిమా ప్రేక్షకుడిని కదిలిస్తుంది’’ అని రానా తెలిపారు.

భూషణ్ మనోజ్, సురాజ్ సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదట మహారాష్ట్రలో ఈ శుక్రవారం విడుదల కానుంది. తర్వాత దేశవ్యాప్తంగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పుడు ప్రశ్న ఒక్కటే – తెలుగు ప్రేక్షకులు ‘సబర్ బొండా’లాంటి సున్నితమైన కానీ వివాదాస్పద కథను అంగీకరిస్తారా?

ఈ శుక్రవారం మహారాష్ట్రలో విడుదల అవుతున్న ‘సబర్ బొండా’ , తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించబోతోంది. రానా ఎంచుకున్న ఈ కొత్త ప్రయోగం ప్రేక్షకులను ఎంతవరకు కదిలిస్తుందో చూడాలి!

, , , ,
You may also like
Latest Posts from