

దేశంలో అక్రమఆన్‌లైన్ బెట్టింగ్ పై యుద్దం కొనసాగుతోంది. దేశంలో ఢిల్లీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఒక కీలక మనీ లాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. ఆ కేసులో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పై కూపీ లాగుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ సోషల్ మీడియా, యాప్ స్టోర్లు, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు ప్రకటనల ద్వారా నడుస్తున్నాయి. ఇప్పటికే క్రికెట్ స్టార్స్ శిఖర్ ధావన్, సురేష్ రైనా ఈ కేసులో విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఈ కేసులో సినీ నటి మిమి చక్రవర్తి, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ మోసపూరిత యాప్స్ వెనక పెద్ద స్కాండల్ దాగి ఉందని ఈడీ దర్యాప్తు చేస్తోంది.
అసలు విషయం ఏమిటి?
ఈ యాప్స్ ప్రస్తుతం నిషేధించబడిన లిస్ట్ లో ఉన్నాయి. కానీ చట్ట విరుద్దంగా సామాన్య ప్రజలకు ఆకర్షణీయమైన స్కీమ్స్ చూపించి, డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ డబ్బును విదేశాలకు తరలిస్తూ మనీ లాండరింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి యాప్స్‌కు సోషల్ మీడియా, యూట్యూబ్, ఇతర వెబ్‌సైట్‌లు ప్రకటనల రూపంలో సహకరించాయి. గతంలో గూగుల్, మెటా (ఫేస్‌బుక్ మాతృ సంస్థ) ప్రతినిధులను కూడా ఈడీ విచారించింది.
ఈడీ చెప్పేదాని ప్రకారం ఈ నటులు, సెలబ్రెటీలు కొన్ని అక్రమ బెట్టింగ్ యాప్స్‌ను ప్రకటనల రూపంలో ప్రమోట్ చేసారు. అందు నిమిత్తం వారు ఎలాంటి ఫీజులు తీసుకున్నారు? ఎంతవరకు సంబంధం ఉంది? అన్నది ఈడీ కూపీ లాగుతోంది.
బెట్టింగ్ మార్కెట్ షాకింగ్ గణాంకాలు
- ఇప్పటివరకు220 మిలియన్ మంది భారతీయులుఈ అక్రమ యాప్స్ వాడారు.
- వారిలో సగం మంది అంటే 110 మిలియన్లు రెగ్యులర్ యూజర్లు!
- 2025 మొదటి మూడు నెలల్లోనే1.6 బిలియన్ విజిట్స్రికార్డు!
- మార్కెట్ విలువ: $100 మిలియన్(రూ.27,000 కోట్లు పన్ను ఎగ్గొట్టారట!). ప్రభుత్వం కఠిన చర్యలు
2022 నుంచి ఇప్పటివరకు 1,524 వెబ్‌సైట్‌లు, యాప్స్‌ను కేంద్రం బ్లాక్ చేసింది. అయినప్పటికీ కొత్త పేర్లతో కొత్త యాప్స్ మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు ఈ స్కాండల్‌లో మరికొంతమందిసినిమా, స్పోర్ట్స్ సెలెబ్రిటీలుపేర్లు బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. సెలెబ్రిటీలు ప్రమోట్ చేసే యాప్స్ వెనక ఇంత పెద్ద స్కామ్ ఉంటుందని ఊహించారా? ఇంకెవరి పేర్లు బయటపడతాయో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్!