మెల్లిమెల్లిగా తెలుగులో ఊర్వశీ రౌతేలా సెటిలయ్యేలా కనపడుతోంది. బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ తో మొదలెట్టి మెల్లి మెల్లిగా ఎదుగుతూ వస్తోంది బ్యూటీ ఊర్వశీ రౌతేలా. తెలుగులో చిరంజీవి సరస వాల్తేర్ వీరయ్య మూవీలో చేసిన ఐటమ్ సాంగ్ బాగా గుర్తింపు తెచ్చింది. ఆ గుర్తింపుతోనే బాలయ్య మూవీ డాకూ మహారాజ్ లో ఆఫర్ అందించింది. బాలయ్య తర్వాత అమ్మడు ఇప్పుడు అబ్బాయ్ మూవీలోనూ ఆఫర్ అందుకుందనే వార్తలు వస్తున్నాయి

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమాలో ఊర్వశి రౌతేలాకి ఛాన్స్ దొరికింది. ఇప్పటికే, ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది. వచ్చే షెడ్యూల్ లో ఊర్వశి రౌతేలా కూడా షూట్ లో జాయిన్ కానుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్‌లో తారక్‌ లేని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.

https://www.instagram.com/urvashirautela/?utm_source=ig_embed&ig_rid=ea8a8385-5edb-4862-a18f-fc9cc9208082

మార్చి నుంచి ఎన్టీఆర్ ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను రెడీ చేస్తున్నారు. ఈ సెట్ లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ స్టార్ట్ కాబోతుంది. ఈ పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌ కనిపించబోతుంది. మలయాళ యువ హీరో టొవినో థామస్‌ కీలక పాత్రలో నటించనున్నాడు.

ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆ మధ్య ఈ సినిమా గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ‘ఆడియన్స్ ఊహించని స్థాయిలో ఈ మూవీని తీస్తున్నాను. ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సినిమా చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు.

,
You may also like
Latest Posts from