
“1 Girl… 10 Obsessions!” – రుక్మిణి వసంత్ క్రేజీ లిస్ట్ వైరల్! ఫ్యాన్స్ షాక్
“కాంతార: చాప్టర్ 1” తర్వాత దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్‌గా ఎదిగిన రక్మిణి వసంత్ ఇప్పుడు సోషల్ మీడియాలో అదరగొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాండ్సమ్‌గా, క్యూట్‌గా కనిపించే ప్రతి పోస్ట్‌కి అభిమానులు పిచ్చాపాటిగా లైక్స్ కొడుతుండగా… ఈసారి మాత్రం రుక్మిణి నెట్టింట్లో క్లీన్‌గా బ్లాస్ట్ క్రియేట్ చేసింది!
తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌లో—
“1 girl, 10 obsessions.”
అని చిన్న క్యాప్షన్‌తోనే ఫ్యాన్స్‌ని కుతూహలంతో ఉంచింది. వెంటనే ఆ క్యారసెల్‌లో తాను పూట పూటా “అడిక్ట్” అయిన పదింటిని షేర్ చేసింది.
రుక్మిణి వసంత్ టాప్ 10 ఒబ్సెషన్స్ ఇవే:
పుస్తకాలు
కలర్ఫుల్ ప్లేట్ (ఆహారంపై కళ్లుచెదిరే కలర్స్)
పూలు
సన్‌సెట్స్
సముద్రం
చెట్ల మధ్య వీచే గాలి
గుర్రపు స్వారీ
పని
ఐస్‌క్రీమ్
నేచర్ వాక్స్
పోస్ట్ పడిన వెంటనే కమెంట్స్ సెక్షన్ లవ్ ఎమోజీలతో నిండిపోయింది. “ఇంత ప్యూర్ పర్సనాలిటీ అరుదు” అంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇక వర్క్‌ఫ్రంట్‌కి వస్తే—
రుక్మిణివచ్చే ఏడాది మార్చిలో విడుదల కానున్న యష్ సినిమా “Toxic” లో హీరోయిన్‌గా కనిపించబోతోంది.
అలాగే NTR – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ప్లాన్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్‌లో కూడా ఆమె హీరోయిన్‌గా ఉండబోతుందన్న బజ్ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది.
ఇప్పటికే ఇన్‌స్టాలో 3.4 మిలియన్ ఫాలోవర్లతో అమ్మడు దూసుకుపోతుండగా… ఈ రేట్‌కు రుక్మిణిక్రేజ్ ఇంకెంత హైకి వెళుతుందో చూడాలి!
