మనకు పెద్ద సినిమాలు అంటే మొదటినుంచీ మోజు.. ఒక క్రేజ్‌. టీజర్, ట్రైలర్‌ రావడానికి ముందే ఏదైనా స్టిల్ బయటకు వస్తే పబ్లిక్‌లో ఆరాటం రెట్టింపు అవుతుంది. ఇలాంటివి మొదట్లో యాక్సిడెంట్‌లా అనిపించేవి, కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు అంటే లీకులు తప్పనిసరి అన్నట్టే అలవాటు అయిపోయింది.

అయితే ఇలాంటి లీకుల్ని కంట్రోల్ చేయడంలో ఎప్పుడూ జీరో టాలరెన్స్ చూపించే వాడు రాజమౌళి. షూటింగ్‌ స్పాట్‌ లో ఎవరూ మొబైల్ ఫోన్ తీసుకురాకూడదు, ఏ హీరోకి కూడా స్వేచ్ఛ లేదు అనేంత వరకు సెక్యూరిటీ కఠినంగా ఉంటుంది. కానీ SSMB29 విషయంలో ఆయన కఠిన నిబంధనలు కూడా వర్కౌట్‌ అవ్వడం లేదు.

ఇప్పటికే కొన్ని నెలల క్రితం మహేష్‌ బాబు ఓ లుక్‌ బయటకు వచ్చేసింది. దాంతో టీమ్‌ వార్నింగ్ ఇచ్చినా, తాజాగా కెన్యా షెడ్యూల్‌ నుంచి మరోసారి స్టిల్స్ లీక్ అయ్యాయి. మహేష్‌ బాబు ఆఫ్రికా జంగిల్ బ్యాక్‌డ్రాప్‌లో, ఆలివ్ గ్రీన్ ఫుల్‌ స్లీవ్ టీ-షర్ట్, డెనిమ్ జీన్స్‌లో కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక లీకుల వల్ల సినిమా హైప్‌ డ్యామేజ్ అవుతుందన్న భయంతో రాజమౌళి మరింత స్ట్రిక్ట్ అవుతూ, వచ్చే షెడ్యూల్ నుంచి ఫోన్‌లపై పూర్తి నిషేధం అమలు చేయాలని నిర్ణయించారట.

SSMB29 రెండు భాగాలుగా రూపొందుతున్న గ్లోబల్ అడ్వెంచర్. ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్న ఈ పాన్-వరల్డ్ మూవీకి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.

, , , , ,
You may also like
Latest Posts from