“ఓజీ”లో పవన్ కళ్యాణ్ భార్యగా ‘కన్మణి’ పాత్రలో మెరిసిన హీరోయిన్ ప్రియాంకా మోహన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ హీరోతో నటించిన మొదటి తెలుగు సినిమా ఆమెకు భారీ గుర్తింపునిచ్చింది. కానీ, అదే పేరుప్రతిష్ట ఇప్పుడు ఒక ఇబ్బందికర పరిస్థితిని తెచ్చింది.

తాజాగా కొందరు సైబర్ దుండగులు AI టెక్నాలజీతో ప్రియాంకా మోహన్ ఫేక్ ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో పంచుతున్నారు. వాటిలో కొన్ని సిగ్గు తెప్పించేలా, సెక్సీ లుక్‌లో ఉన్నట్లుగా రూపొందించారట! ఈ ఫోటోలు వైరల్ కావడంతో హీరోయిన్ స్పందించింది.

ప్రియాంకా మోహన్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా పోస్ట్ చేసింది

“నన్ను తప్పుగా చూపించే AI ఫేక్ ఇమేజెస్ సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. దయచేసి ఆ ఫోటోలు పంచుకోవడం ఆపండి. AI టెక్నాలజీని తప్పుగా కాకుండా సృజనాత్మకత కోసం ఉపయోగించండి. మనం సృష్టించే దానికి, పంచుకునే దానికి బాధ్యతగా ఉండాలి. ధన్యవాదాలు.”

AI దుర్వినియోగంపై ఆమె ఈ స్పందన ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే — ప్రియాంకా మోహన్ తన తదుపరి తెలుగు ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు.

, , , ,
You may also like
Latest Posts from