ఫోటోలుసినిమా వార్తలు

అనసూయ…రాశీపై ఆ బూతు కామెంట్!?ఇప్పుడిదే వైరల్

90వ దశకంలో టాలీవుడ్ కుర్రాళ్ల కలల రాజకుమారి ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు రాశి. గోకులంలో సీతగా పద్ధతైన అందంతో అలరించినా, ‘సముద్రం’లో తన గ్లామర్ తడాఖా చూపించినా ఆమెకే చెల్లింది. జగపతి బాబు, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన బ్లాక్ బస్టర్ హిట్లతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన ఈ ‘ప్రేయసి రావే’ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ వార్తల్లో నిలిచారు.

కట్ చేస్తే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో శివాజీ చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. హీరోయిన్ల దుస్తులపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను రెండు వర్గాలుగా చీల్చేశాయి. ఈ వివాదంలో యాంకర్ అనసూయ, చిన్మయి లాంటి వారు శివాజీపై విమర్శల వర్షం కురిపిస్తుంటే.. సీనియర్ నటి రాశి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఎంట్రీ ఇచ్చారు.

శివాజీకి మద్దతుగా నిలుస్తూనే.. తన పేరు ఎత్తకుండా విమర్శిస్తున్న ఒక ‘టాప్ యాంకర్’ గతాన్ని తవ్వి తీశారు రాశి. “నాడు నా బాడీ గురించి అసభ్యంగా జోకులు వేసి, ఇప్పుడు నీతులు చెబుతున్నావా?” అంటూ ఇన్ డైరెక్ట్ గా అనసూయపై రాశి చేసిన ఈ ఫైర్ బ్రాండ్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ కేకులా మారాయి. అప్పట్లో అసలు ఏం జరిగింది? రాశి ఎందుకు అంతలా రగిలిపోతున్నారు? ఆ 12 షాకింగ్ నిజాలు మీకోసం..!

టాలీవుడ్‌లో కొత్త వార్!

ఒకరు 90ల నాటి గ్లామర్ క్వీన్.. మరొకరు నేటి తరం హాట్ యాంకర్! శివాజీ ఇష్యూలో అనసూయ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం, సీనియర్ నటి రాశి ఊహించని రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్!

శివాజీకి సపోర్ట్.. అనసూయకు స్పాట్!

బట్టల విషయంలో శివాజీ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే లేపాయి. అయితే, శివాజీ తప్పు చేసి క్షమాపణ చెప్పారని సపోర్ట్ చేసిన రాశి.. అనసూయ పేరు ఎత్తకుండానే పాత గాయాలను కెలికారు.

ఆ ‘కామెడీ షో’ సీక్రెట్!

నాలుగేళ్ల క్రితం ఒక పాపులర్ కామెడీ షోలో జరిగిన ఇన్సిడెంట్‌ను రాశి బయటపెట్టారు. ఆ షోకి తనను గెస్టుగా పిలిచారని, కానీ అక్కడే అసలు డ్రామా మొదలైందని బాంబు పేల్చారు.

‘ప్రేయసి రావే’ క్లాసిక్ – కామెడీ స్కిట్!

రాశి కెరీర్‌లో ‘ప్రేయసి రావే’ ఒక క్లాసిక్ హిట్. ఆ సినిమాని వెక్కిరిస్తూ కామెడీ స్కిట్ చేయాలని షో నిర్వాహకులు కోరారట. దానికి రాశి “నో” చెప్పడంతో వివాదం ముదిరింది.

బాడీ షేమింగ్ కామెంట్స్!

రాశి రాకపోయేసరికి, ఆ షోలో యాంకర్ (అనసూయ) మరియు హైపర్ ఆది కలిసి ఒక స్కిట్ చేశారట. అందులో రాశి బాడీ గురించి అత్యంత అసభ్యంగా మాట్లాడారని రాశి ఆవేదన వ్యక్తం చేశారు.

“రాశి గారి ఫలాలు!” – డబుల్ మీనింగ్ డైలాగ్!

“రాశి ఫలాలు చూస్తున్నావా?” అని ఆది అడిగితే.. సదరు యాంకర్ “రాశి గారి ఫలాలు గురించి మాట్లాడుతున్నావా?” అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ కొట్టిందట. ఒక మహిళ అయి ఉండి ఇలా మాట్లాడటం ఏంటని రాశి ఫైర్ అయ్యారు.

జడ్జి రోజాపై కూడా గుస్సా! ఆ కామెంట్స్ చేసినప్పుడు అక్కడ జడ్జిగా ఉన్న రోజా గారు నవ్వడం రాశికి అస్సలు నచ్చలేదట. “నేను ఆ ప్లేస్ లో ఉంటే స్కిట్ ఆపేసేదాన్ని, కానీ ఆమె నవ్వడం బాధించింది” అని రాశి కుండబద్దలు కొట్టారు.

లీగల్ నోటీసులు ఇవ్వాలనుకున్నా!

తన వ్యక్తిత్వాన్ని, బాడీని కించపరిచినందుకు ఆ యాంకర్‌పై, ఆ షోపై కోర్టులో కేసు వేయాలని రాశి గట్టిగా ఫిక్స్ అయ్యారట. లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అప్పట్లో అంతా రెడీ చేసుకున్నారట.

అమ్మ కోసమే ఆగిపోయా..

కేసు వేద్దామని అనుకున్న టైంలో రాశి తల్లి ఆమెను వారించారట. “అవన్నీ మనకెందుకు తల్లీ” అని అమ్మ చెప్పడంతోనే ఆ యాంకర్‌ను వదిలేశానని రాశి అసలు విషయం రివీల్ చేశారు.

ఇప్పుడు నీతులు చెబుతున్నావా?

శివాజీ కామెంట్స్ మీద అనసూయ రియాక్ట్ అవ్వడాన్ని టార్గెట్ చేస్తూ.. “అప్పుడు నా బాడీ గురించి అంత నీచంగా కామెంట్స్ చేసినప్పుడు లేని నీతులు, ఇప్పుడు గుర్తొచ్చాయా?” అన్నట్లుగా రాశి ఇన్ డైరెక్ట్ సెటైర్లు వేశారు.

బాడీ షేమింగ్ హక్కు ఎవరికీ లేదు!

“కన్న తల్లిదండ్రులకు కూడా మన బాడీని కామెంట్ చేసే హక్కు లేదు, అలాంటిది ఒక టీవీ షోలో అంత మంది ముందు అవమానిస్తారా?” అంటూ రాశి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాశి వర్సెస్ అనసూయ – నెక్స్ట్ ఏంటి?

రాశి చేసిన ఈ సంచలన కామెంట్స్‌పై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి. సోషల్ మీడియాలో ఇద్దరు భామల ఫ్యాన్స్ మధ్య వార్ ఆల్రెడీ మొదలైపోయింది!

Similar Posts