సినిమా వార్తలుసోషల్ మీడియా

72 లక్షల భారీ స్కామ్! దర్శకుడు తేజ కొడుకును నిలువునా ముంచేసిన దంపతులు

ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాలకు సామాన్యులే కాదు, సెలబ్రిటీల కుటుంబాలు కూడా బలైపోతున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ తాజాగా ఒక భారీ చీటింగ్ నెట్‌వర్క్‌లో చిక్కుకుని ఏకంగా 72 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఉదంతం ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది.

అసలు ఏం జరిగింది?

వ్యాపారవేత్త అయిన అమితవ్ తేజకు 2025 ఏప్రిల్‌లో హైదరాబాద్ మోతీనగర్ కు చెందిన అనూష, ప్రణీత్ అనే దంపతులతో పరిచయం ఏర్పడింది. “మా దగ్గర పెట్టుబడి పెట్టండి.. ఊహించని లాభాలు ఇప్పిస్తాం. ఒకవేళ నష్టం వస్తే మా అపార్ట్‌మెంట్ ఫ్లాట్ మీకే రాసిస్తాం” అంటూ వారు అమితవ్‌కు గాలం వేశారు.

కిలాడీ ప్లాన్:

నకిలీ లాభాలు: పెట్టుబడి పెట్టిన వారం రోజులకే రూ. 9 లక్షల లాభం వచ్చిందంటూ ఫేక్ డాక్యుమెంట్లతో అమితవ్‌ను నమ్మించారు.

పెట్టుబడుల వర్షం: ఆ నమ్మకంతో అమితవ్ విడతల వారీగా రూ. 63 లక్షలు వారి చేతిలో పెట్టారు.

అసలుకే ఎసరు: నెలలు గడుస్తున్నా లాభం రాకపోగా, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి ఇవ్వకుండా ఆ దంపతులు ముఖం చాటేశారు.

తను మోసపోయానని గ్రహించిన అమితవ్ తేజ వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో మోసం జరగడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

Similar Posts