సినిమా వార్తలు

షాకింగ్: ‘ధురంధర్’ నటుడి కామలీలలు.. పదేళ్లుగా పనిమనిషిని ఏం చేశాడంటే?!

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్’ సినిమా సునామీ సృష్టిస్తోంది. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కావడమే కాదు, హిందీలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతోంది. కానీ, ఇంతటి గ్రాండ్ హిట్ సినిమాలో నటించిన ఒక నటుడు ఇప్పుడు కటకటాల పాలవ్వడం బాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టించింది.

పదేళ్ల పాటు పక్కలోకి.. పెళ్లి అని నమ్మించి మోసం!

ఈ సినిమాలో అక్షయ్ ఖన్నాకు వంటవాడిగా నటించిన నదీమ్ ఖాన్, నిజజీవితంలో మాత్రం ఒక పెద్ద విలన్ అవతారం ఎత్తాడు. తన ఇంట్లో పనిచేసే 41 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గత పదేళ్లుగా ఆమెపై నిరంతరం అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ముంబై పోలీసులు నదీమ్ ఖాన్‌ను అరెస్ట్ చేయడంతో ఈ దారుణమైన మ్యాటర్ బయటపడింది.

రెండు ఇళ్లలోనూ అదే తతంగం!

బాధితురాలు గతంలో చాలామంది సినీ సెలబ్రిటీల ఇళ్లలో పనిమనిషిగా చేసింది. నదీమ్ ఖాన్‌తో పరిచయం పెరగడంతో, పెళ్లి చేసుకుంటానన్న మాటను నమ్మి అతడికి దగ్గరయ్యింది. మాల్వానీలోని తన ఇంట్లో, అలాగే వెర్సోవాలోని నదీమ్ నివాసంలో పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇన్నేళ్లూ పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉన్న బాధితురాలు.. పెళ్లి విషయంపై నిలదీయగా అతడు ప్లేట్ ఫిరాయించడంతో నేరుగా పోలీస్ స్టేషన్ ఎక్కింది.

కేబీపీ (KBC)లో కూడా మెరిశాడు.. కానీ!

నదీమ్ ఖాన్ కేవలం ‘ధురంధర్’ మాత్రమే కాదు.. మిమి (Mimi), వాధ్ (Vadh) వంటి హిట్ సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేశాడు. అంతేకాదు, అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌లో కూడా పాల్గొని టీవీ ఆడియన్స్‌కు సుపరిచితుడయ్యాడు. ఇంతటి సెలబ్రిటీ స్టేటస్ ఉండి కూడా, ఒక సామాన్య మహిళను శారీరకంగా, మానసికంగా వేధించడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.

ముంబై పోలీసులు నదీమ్ ఖాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. “సెలబ్రిటీ హోదా ఉంటే సరిపోదు.. చట్టం ముందు అందరూ సమానమే” అని పోలీసులు స్పష్టం చేశారు.

Similar Posts