సినిమా వార్తలు

అల్లు అర్జున్ హీరోయిన్ కోసం ఆ మినిస్టర్లు ఫోన్లు చేశారు.. ఇన్నాళ్లకు గుణశేఖర్ రివీల్ చేసిన షాకింగ్ సీక్రెట్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ లో ‘పుష్ప’ లాంటి పాన్ ఇండియా హిట్స్ ఎంత కామన్ అయ్యాయో.. డిజాస్టర్లు అంత రేర్. కానీ బన్నీ ఫ్యాన్స్ మర్చిపోవాలనుకునే సినిమాల లిస్ట్ తీస్తే అందులో మొదట వినిపించే పేరు ‘వరుడు’. 5 రోజుల పెళ్లి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా ప్లాప్ వెనుక, హీరోయిన్ ఎంపిక వెనుక జరిగిన అసలు డ్రామాని డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) తాజాగా బయటపెట్టారు.

హీరోయిన్ కోసం మినిస్టర్ల ఫోన్లు!

అప్పట్లో ‘వరుడు’ సినిమాకి చేసిన ప్రమోషన్ మామూలుగా లేదు. సినిమా రిలీజ్ అయ్యే వరకు హీరోయిన్ ముఖం చూపించకుండా సస్పెన్స్ మెయింటైన్ చేశారు. ఈ స్ట్రాటజీనే పెద్ద రచ్చ చేసిందట. గుణశేఖర్ మాట్లాడుతూ.. “హీరోయిన్ ఎవరో చెప్పకుండా దాచడం వల్ల జనాల్లో విపరీతమైన క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇండస్ట్రీ వాళ్లే కాదు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, మినిస్టర్లు కూడా నాకు ఫోన్ చేసి ‘ఎవరయ్యా ఆ హీరోయిన్?’ అని ఆరా తీసేవారు” అని చెప్పుకొచ్చారు.

అదే కొంప ముంచిందా?

హీరోయిన్ ని దాచిపెట్టడం వల్ల పెరిగిన అంచనాలే సినిమాకి మైనస్ అయ్యాయని గుణశేఖర్ అభిప్రాయపడ్డారు. “అంత హైప్ క్రియేట్ చేశాక.. తెరపై హీరోయిన్ ని చూసి ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో నిరాశ చెందారు” అని ఆయన అసలు విషయం ఒప్పుకున్నారు.

నవలని మార్చి.. తప్పు చేశా!

నిజానికి ‘వరుడు’ కథ ఒక మంచి నవల ఆధారంగా రాసుకున్నదట. కేవలం ‘5 రోజుల పెళ్లి’ అనే కాన్సెప్ట్ తో స్వచ్ఛమైన ఫ్యామిలీ స్టోరీగా తీయాలనుకున్నారట. కానీ.. “ఇలా తీస్తే సినిమా ఆడదు” అని కొందరు భయపెట్టడంతో, బలవంతంగా కథలో మార్పులు చేసి యాక్షన్ సినిమాగా మార్చాల్సి వచ్చిందని గుణశేఖర్ వాపోయారు. అదే గనక నవల ప్రకారం తీసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో అని ఆయన అన్నారు.

ప్రస్తుతం గుణశేఖర్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘యూఫోరియా’ (Euphoria) సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా పాత జ్ఞాపకాలను ఇలా పంచుకున్నారు.

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి!

Similar Posts