
పేరు మార్పు: రెండో పెళ్లి తర్వాత సమంత తీసుకున్న షాకింగ్ నిర్ణయం! కొత్త పేరు ఏంటంటే…
టాలీవుడ్ క్వీన్ సమంత (Samantha) పేరు ఒకప్పుడు వెండితెరపై సంచలనం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక మిస్టరీ. ప్రేమ, పెళ్లి, విడాకులు, ప్రాణాంతక వ్యాధి.. ఒక మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు రావాలో అన్నీ ఒకేసారి ఆమెను చుట్టుముట్టాయి. వాటన్నింటినీ ఒంటరిగా ఎదుర్కొని, ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితాన్ని (Second Innings) ప్రారంభించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రయాణం ఎలా సాగిందో ఈ చూద్దాం.

అందాల బొమ్మ టు స్టార్ హీరోయిన్
‘ఏ మాయ చేశావే’ సినిమాతో కుర్రాళ్ళ మనసు దొచుకున్న జెసీ.. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ చైర్ ని దక్కించుకుంది. గ్లామర్ పాత్రలైనా, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలైనా సమంత దిగనంత వరకే. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ప్రేమలో పడి సాహసోపేత నిర్ణయం తీసుకుంది.

అక్కినేని ఇంట అడుగుపెట్టి..
నాగ చైతన్యతో ప్రేమాయణం.. ఆ తర్వాత గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్.. అప్పట్లో అదొక ఫెయిరీ టేల్ (Fairy Tale). అక్కినేని వారి కోడలిగా సమంత ఎంతో హుందాగా వ్యవహరించింది. అత్తారింటి గౌరవాన్ని పెంచుతూనే, మరోపక్క సినిమాల్లోనూ దూసుకుపోయింది. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న సమయంలోనే విధి వెక్కిరించింది.

ఊహించని విడాకులు.. గుండె పగిలిన వేళ
నాలుగేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ చై-సామ్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ విడాకులు సమంతను మానసికంగా కుంగదీశాయి. ఒక పక్క బంధం తెగిపోయిన బాధ, మరోపక్క ఎటూ వెళ్ళలేని నిస్సహాయత. ఆ రోజుల్లో ఆమె పడిన వేదన అంతా ఇంతా కాదు.

నిందలు, ట్రోల్స్.. నరకం చూసింది!
విడాకుల తర్వాత సమాజం వేలెత్తి చూపింది ఎక్కువగా సమంతనే. ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లలు వద్దనుకుందని, అబార్షన్ చేయించుకుందని.. సోషల్ మీడియాలో ఘోరమైన ట్రోలింగ్ జరిగింది. అయినా సరే, పల్లెత్తు మాట అనకుండా ఆ విషాన్ని మొత్తం గొంతులోనే దాచుకుంది.

పుండు మీద కారంలా.. మయోసైటిస్!
మానసిక ప్రశాంతత కోసం వెతుకుతున్న సమయంలోనే శారీరక ఆరోగ్యం దెబ్బతింది. ‘మయోసైటిస్’ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఆమెను మంచానికే పరిమితం చేసింది. సెలైన్ బాటిల్స్ ఎక్కించుకుంటూ, కనీసం నిలబడలేని స్థితిలో ఆమె డబ్బింగ్ చెప్పిన ఫోటోలు చూసి ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆధ్యాత్మిక బాటలో ప్రశాంతత కోసం..
మందులతో పాటు దైవ చింతన కూడా ఆమెకు బలాన్నిచ్చింది. ఈషా ఫౌండేషన్, గుళ్ళు, గోపురాలు తిరుగుతూ మనసును గట్టి చేసుకుంది. డిప్రెషన్ నుంచి బయటపడటానికి మెడిటేషన్ ని నమ్ముకుంది. ఆ సమయంలో ఆమెలోని ఒక కొత్త కోణాన్ని ప్రపంచం చూసింది.

పనినే ప్రాణంగా మార్చుకుని..
అన్ని కష్టాల్లోనూ సినిమాను వదలలేదు. ‘శాకుంతలం’, ‘యశోద’, ‘ఖుషి’ వంటి సినిమాలతో పాటు.. బాలీవుడ్ లో ‘సిటాడెల్’, ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. తన పెయిన్ కి పెయిన్ కిల్లర్ తన పనే అని నిరూపించుకుంది.

రాజ్ నిడిమోరుతో కొత్త అనుబంధం?
‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ సమయం నుంచి డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంతకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. కష్టకాలంలో ఆమెకు అండగా నిలిచారట. ఆ స్నేహమే ఇప్పుడు ప్రేమగా మారి, పెళ్లి వరకు వచ్చిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

సీక్రెట్ మ్యారేజ్ & కొత్త పేరు?
చైతు రెండో పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే.. సమంత కూడా రాజ్ నిడిమోరుని సీక్రెట్ గా పెళ్లాడిందని టాక్. దానికి బలం చేకూరుస్తూ.. ఇప్పుడు ఆమె తన కొత్త సినిమాలో “సమంత నిడిమోరు” అనే పేరుతో టైటిల్ కార్డ్స్ వేయించుకోబోతోందట. ఇదే ఇప్పుడు వైరల్ అవుతున్న హాట్ టాపిక్.

మా ఇంటి ‘బంగారం’.. ఈసారైనా సంతోషమేనా?
ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా ఆమెకు చాలా స్పెషల్. టైటిల్ లోనే కాదు, జీవితంలోనూ ఆమె బంగారం లాంటి రోజులు చూడాలని, గతం తాలూకు గాయాలన్నీ మాసిపోయి.. ఈ కొత్త ప్రయాణంలో (Nidimoru Family?) ఆమె నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుందాం.
జీవితం అంటేనే ఎత్తుపల్లాలు. అందులో సమంత చూసిన లోతు చాలా ఎక్కువ. అందుకే ఇప్పుడు ఆమె ఎక్కబోయే ఎత్తు కూడా అంతే గొప్పగా ఉండాలి. ఈ ‘నిడిమోరు’ న్యూస్ నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే!
ఈ ఫోటో ఫీచర్ మీకు నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి!
