బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ (Ranveer Singh), డైరెక్టర్ ఆదిత్య ధర్ (Aditya Dhar) కాంబినేషన్‌లో వచ్చిన పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ. 1300 కోట్ల గ్రాస్‌తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఒక విచిత్రమైన వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం 2014లో వచ్చిన ఒక భోజ్‌పురి సినిమాకి అచ్చుగుద్దినట్లు ఉందని ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ చేస్తున్న వాదనలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

ధురంధర్ vs ధురంధర్ ద షూటర్ (Dhurandhar vs Dhurandhar The Shooter) రవి కిషన్ నటించిన భోజ్‌పురి చిత్రం ‘ధురంధర్ ద షూటర్’ కి ఇది కాపీ అని ఆరోపణలు వస్తున్నాయి. ఆ వీడియోలో పేర్కొన్న ప్రకారం, రెండు సినిమాల మధ్య పోలికలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే:

ఒకే టైటిల్: రెండు సినిమాల పేర్లు ‘ధురంధర్’ అని ఉండటం మొదటి పోలిక.

హీరో పేరు: రణవీర్ సింగ్ సినిమాలో హీరో పేరు రణవీర్ కాగా, భోజ్‌పురి వెర్షన్‌లో కూడా అదే రిఫరెన్స్ ఉండటం గమనార్హం.

ప్లాట్ పాయింట్స్: రెండు చిత్రాల కథలు కూడా ఎన్నికలు, రాజకీయ నేపథ్యం చుట్టూనే తిరుగుతాయని సదరు ఇన్‌ఫ్లుయెన్సర్ వాదిస్తున్నారు.

క్లైమాక్స్ సీన్ టు సీన్ కాపీ?

అన్నిటికంటే షాకింగ్ విషయం ఏమిటంటే.. క్లైమాక్స్ సన్నివేశాలు అచ్చం ఒకేలా ఉన్నాయట. కారులో రైట్ టర్న్ తీసుకోవడం, బ్యాక్ మిర్రర్‌లో చూడటం, కళ్ళ క్లోజప్ షాట్స్, కో-ప్యాసింజర్‌ని కాల్చడం మరియు చివరలో వచ్చే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్.. ఇవన్నీ భోజ్‌పురి సినిమా నుండి ‘డిట్టో’గా దించేశారని ఆరోపిస్తున్నారు. “ఆదిత్య ధర్ గారు కచ్చితంగా ఆ సినిమా చూసే ఉంటారు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ కాపీ ఆరోపణలతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి చర్చిస్తున్నారు.

మరోవైపు, అభిమానులు ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమాచారం ప్రకారం, ఈ సీక్వెల్ మార్చి 19, 2026న విడుదల కానుంది. ఈ లోగా ఈ ‘కాపీ’ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

#Aditya Dhar, #Bhojpuri Movie, #Dhurandhar, #dhurandhar 2, #Dhurandhar Controversy, #Dhurandhar vs Dhurandhar The Shooter, #Ranveer Singh

By admin