
ఇదేం ట్విస్ట్ ? నాగ చైతన్య చెయ్యాల్సిందే రవితేజ చేస్తున్నాడా? ‘ఇరుముడి’ వెనుక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్!
టాలీవుడ్లో ఒక హీరో వదులుకున్న కథ మరో హీరో దగ్గరికి వెళ్లడం సర్వసాధారణం. కానీ, అది ఒక సూపర్ హిట్ కాంబినేషన్ నుండి వస్తున్న కథ అయితేనే అసలైన చర్చ మొదలవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న హాట్ న్యూస్ ఏంటంటే.. మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) సినిమా నిజానికి అక్కినేని నాగ చైతన్య చేయాల్సింది!
మజిలీ కాంబో ఎందుకు మిస్ అయింది?
‘నిన్ను కోరి’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ శివ నిర్వాణ, నాగ చైతన్యతో ‘మజిలీ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ క్రమంలోనే చైతూ కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి వినిపించారు. కథ విన్న నాగ చైతన్యకు కూడా బాగా నచ్చింది, కానీ ఎందుకో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి చాలా సమయం తీసుకున్నారు.
మాస్ రాజా ఎంట్రీ!
చైతూ నుండి క్లారిటీ రావడంలో ఆలస్యం కావడంతో, శివ నిర్వాణ ఆ కథను రవితేజకు వినిపించారు. మాస్ రాజాకు కథ విపరీతంగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఇద్దరికీ ఇప్పటికే అడ్వాన్స్‌లు ఇచ్చి ఉండటంతో, ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
చైతూ మిస్ చేసుకున్నాడా? లేక తప్పించుకున్నాడా?
శివ నిర్వాణ గత చిత్రాలు ‘టక్ జగదీష్’, ‘ఖుషి’ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో చైతూ ఈ సినిమా విషయంలో వెనకడుగు వేశారా? లేక రవితేజ తన మాస్ ఇమేజ్‌తో ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తారా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ‘ఇరుముడి’లో రవితేజ మునుపెన్నడూ చూడని కొత్త షేడ్‌లో కనిపించబోతున్నారని టాక్.
ఈ ఏడాది చివరలో విడుదల కాబోతున్న ఈ సినిమాతో నాగ చైతన్య ఒక గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నారో లేదో తెలిసిపోతుంది!
