
తమన్నా కోసం రజనీకాంత్ సిఫార్సు? మైసూర్ సాండల్ రచ్చలో షాకింగ్ ట్విస్ట్!
కర్నాటకలో ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్నా (Tamannaah) పేరు మారుమోగిపోతోంది. మైసూర్ సాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను నియమించడంపై కన్నడ సంఘాలు భగ్గుమంటున్నాయి. రష్మిక మందన్నా, దీపికా పదుకొణె లాంటి కన్నడ భామలు ఉండగా తమన్నా ఎందుకు? అని ప్రశ్నిస్తున్న వేళ.. కర్నాటక మంత్రి ఎంబీ పాటిల్ సంచలన విషయాలు వెల్లడించారు.
కమిటీలో రజనీకాంత్.. నిర్ణయం ఆయనదేనా?
ఈ బ్రాండ్ అంబాసిడర్ ఎంపిక కోసం ప్రభుత్వం కొద్ది నెలల క్రితమే ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. ఈ కమిటీ సభ్యులందరూ కలిసి సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తమన్నా పేరును ఫైనల్ చేశారని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదంలోకి రజనీకాంత్ పేరు రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దీపికా, రష్మికలకు ఎందుకు ఛాన్స్ రాలేదు?
కన్నడ మూలాలున్న దీపికా పదుకొణె పేరును కూడా కమిటీ పరిశీలించింది. కానీ ఆమె అడిగిన పారితోషికం ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ కంటే చాలా ఎక్కువగా ఉందట. పైగా ఆమెకు సొంతంగా ఒక బ్యూటీ బ్రాండ్ ఉండటం కూడా అడ్డంకిగా మారింది. ఇక రష్మిక మందన్నా, శ్రీలీల వంటి హీరోయిన్లను కూడా అనుకున్నప్పటికీ.. వారు అప్పటికే ఇతర సోప్ బ్రాండ్లతో ఒప్పందాలు కలిగి ఉండటంతో తమన్నా వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని మంత్రి వివరణ ఇచ్చారు.
తమన్నా ఎంపిక వెనుక కమర్షియల్ లెక్కలు!
ప్రస్తుతం తమన్నాకు నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. మైసూర్ సాండల్ సోప్‌ను పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ చేయాలంటే తమన్నా సరైన ఆప్షన్ అని కమిటీ భావించినట్లు తెలుస్తోంది. అయితే కన్నడ ఉద్యమకారులు మాత్రం స్థానిక హీరోయిన్లను చిన్నచూపు చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
