
స్మృతి మంధాన మాజీ ప్రియుడిపై సంచలన ఆరోపణలు.. బాంబే హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఏకంగా ₹10 కోట్ల దావా!
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana) మాజీ ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ (Palash Muchhal) చుట్టూ వివాదం ముదురుతోంది. స్మృతి స్నేహితుడిగా చెప్పుకుంటున్న విజ్ఞాన్ మానే అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. “నోరు పారేసుకోవద్దు” అంటూ వార్నింగ్ ఇస్తూనే, పలాశ్‌పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అసలేం జరిగింది? పెళ్లి రద్దు.. ఆపై రచ్చ!
స్మృతి మంధాన – పలాశ్ ముచ్చల్ పెళ్లి రద్దయిన తర్వాత ఈ గొడవ మొదలైంది. స్మృతికి సన్నిహితుడైన విజ్ఞాన్ మానే పలు ఇంటర్వ్యూల్లో పలాశ్‌పై విరుచుకుపడ్డారు. పలాశ్ తన వద్ద ఒక సినిమా కోసం ₹40 లక్షలు తీసుకుని మోసం చేశాడని, అంతేకాకుండా స్మృతితో పెళ్లి రద్దు కావడానికి గల వ్యక్తిగత కారణాలను కూడా ఆయన రచ్చకెక్కించారు.
పలాశ్ మాస్టర్ స్ట్రోక్.. ₹10 కోట్ల పరువు నష్టం!
తనపై, తన తల్లిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ పలాశ్ ముచ్చల్ ఏకంగా ₹10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ మిలింద్ జాదవ్ ధర్మాసనం విజ్ఞాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది.
కోర్టు కీలక వ్యాఖ్యలు: “వ్యాపార పరమైన గొడవలు ఉంటే చట్టప్రకారం చూసుకోవాలి. దానికి పెళ్లి రద్దు వంటి వ్యక్తిగత విషయాలను ముడిపెట్టడం సరికాదు” అని మందలించింది.
పలాశ్ లేదా ఆయన తల్లిని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర ప్రకటనలు చేయరాదని ఆదేశించింది.
మార్చి 11న క్లారిటీ!
విజ్ఞాన్ మానే చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. అప్పటివరకు పలాశ్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేసే వీల్లేదని స్పష్టం చేసింది.
క్రికెట్ స్టార్ స్మృతి మంధాన పేరుతో ముడిపడి ఉన్న ఈ వివాదం ఇప్పుడు ఇటు క్రికెట్ ప్రపంచంలో, అటు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
