తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రంగు మార్చుకుంటున్నాయి. రాజకీయ విమర్శల్లోకి సినీ తారలను లాగడం బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్‌కు చుక్కలు చూపించింది. హీరో విజయ్ (Thalapathy Vijay) వ్యక్తిగత జీవితంపై, నటి త్రిషపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చివరకు కోర్టు నోటీసుల వరకు వెళ్లడంతో ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.

విజయ్‌ను టార్గెట్ చేస్తూ త్రిషను లాగారు!

విషయం ఏంటంటే.. విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీపై విమర్శలు చేసే క్రమంలో నైనార్ నాగేంద్రన్ హద్దులు దాటారు. విజయ్ తన ఇంటి నుంచి బయటకు రావాలని, అంతటితో ఆగకుండా త్రిష ఇంట్లో నుంచి బయటకు రావాలంటూ అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. విజయ్-త్రిష మధ్య ఏదో ఉందన్నట్టుగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాట పెను దుమారాన్నే రేపాయి.

త్రిష లాయర్ ఎంట్రీ.. బీజేపీ షేక్!

ఈ వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా స్పందించారు. వెంటనే తన లాయర్ ద్వారా నైనార్ నాగేంద్రన్‌కు గట్టి హెచ్చరిక పంపారు. “నన్ను మీ మురికి రాజకీయాల్లోకి లాగొద్దు.. నాకు పాలిటిక్స్ వచ్చే ఉద్దేశం లేదు” అని తేల్చిచెప్పడమే కాకుండా, పరువు నష్టం దావా వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనికి తోడు బీజేపీ మహిళా నేత వానతి శ్రీనివాసన్, అన్నామలై కూడా నైనార్ వ్యాఖ్యలను తప్పుబట్టడంతో ఆయన ఒంటరి అయ్యారు.

హృదయపూర్వక విచారం.. వివాదానికి ఎండ్ కార్డ్!

లీగల్ చిక్కులు తప్పవని అర్థం చేసుకున్న నైనార్ నాగేంద్రన్.. ఇవాళ త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. “నా ప్రకటన వల్ల త్రిష గారు లేదా మరెవరైనా బాధపడి ఉంటే హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నాను. ఇది పొరపాటున చేసిన వ్యాఖ్య” అని విచారం వ్యక్తం చేశారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఈ హైడ్రామాకు ప్రస్తుతానికి తెరపడింది.

#BJP Leader Nainar Nagendran, #Legal Warning, #Nainar Nagendran Apologizes, #Thalapathy Vijay, #Trisha, #TVK

By admin