సినిమా వార్తలు

బాలీవుడ్ పెద్దలకు యష్ వార్నింగ్!ఆ ఒక్క ఫోన్ కాల్ చేయకపోవడమే గొడవకు కారణమా?

బాక్సాఫీస్ వద్ద మరో భారీ యుద్ధానికి రంగం సిద్ధమైంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ (Toxic) మరియు రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురందర్ 2’ (Dhurandhar 2) ఒకే రోజు అంటే మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. ఈ క్లాష్‌పై తాజాగా యష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఆ సంస్కృతి బాలీవుడ్‌లో లేదు!

ఈ బాక్సాఫీస్ క్లాష్ గురించి యష్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన అసహనాన్ని వ్యక్తం చేశారు. “టాక్సిక్ సినిమా రిలీజ్ డేట్‌ను మేము ఏడాది క్రితమే ప్రకటించాము. అదే తేదీకి ధురందర్ 2 కూడా వస్తున్నట్లు మాకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. సౌత్ సినిమాల్లో పెద్ద సినిమాలు తలపడేటప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుని సర్దుబాటు చేసుకునే సంస్కృతి ఉంది. కానీ బాలీవుడ్‌లో ఆ కమ్యూనికేషన్ లేకపోవడం బాధాకరం” అని యష్ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

తగ్గేదే లే అంటున్న రాకింగ్ స్టార్!

‘ధురందర్ 2’ ఈద్ పండుగను టార్గెట్ చేస్తూ వస్తున్నప్పటికీ, యష్ మాత్రం తన డేట్ నుండి వెనక్కి తగ్గడం లేదు. “మా ఫ్యాన్స్ ‘కేజీఎఫ్ 2’ తర్వాత మూడేళ్లుగా నా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కేవలం బాక్సాఫీస్ పోటీ ఉందని డేట్ మార్చి వారిని నిరాశపరచను” అని యష్ తన టీమ్‌కు తేల్చి చెప్పేశారట. తన సినిమా కంటెంట్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే క్లాష్‌కు భయపడటం లేదని ఆయన స్పష్టం చేశారు.

రికార్డులు సృష్టిస్తున్న ‘టాక్సిక్’!

రిలీజ్ కంటే ముందే ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది.

ఓవర్సీస్ రైట్స్: ఏకంగా రూ. 105 కోట్లకు అమ్ముడయ్యాయి.

తెలుగు రాష్ట్రాల బిజినెస్: దిల్ రాజు ఈ సినిమా హక్కులను దాదాపు రూ. 120 కోట్లకు దక్కించుకోవడం విశేషం.

టీజర్ & ట్రైలర్: ఫిబ్రవరి చివరి వారంలో టీజర్, మార్చి మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు ‘ధురందర్’ మొదటి భాగం రూ. 1300 కోట్లు వసూలు చేయడంతో సీక్వెల్‌పై బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఈ రెండు భారీ చిత్రాల మధ్య జరిగే యుద్ధంలో విన్నర్ ఎవరో చూడాలి!

Similar Posts