
విజయ్ విడాకులు తీసుకుంటే అన్ని భరణం కోట్లా? మైండ్ బ్లాక్ అయ్యే మొత్తం
కోలీవుడ్ స్టార్ హీరో, రీసెంట్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తలపతి విజయ్ గురించి ఒక షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు తన 26 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పబోతున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. తన భర్త ఒక స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని, అందుకే తనకు విడాకులు కావాలని భార్య సంగీత కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
భరణం కింద రూ. 2000 కోట్లు?
విజయ్ కి దాదాపు రూ. 4000 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు అంచనా. ఒకవేళ సంగీత గనుక విడాకులు తీసుకుంటే, నిబంధనల ప్రకారం ఆయన ఆస్తిలో సగభాగం అంటే దాదాపు రూ. 2000 కోట్లు భరణంగా ఇవ్వాల్సి ఉంటుందని ఆమె తరపు న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ మొత్తం విన్న సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకూ దిమ్మతిరిగిపోతోంది.
రాజకీయాలపై ప్రభావం పడుతుందా?
విజయ్ తాజాగా ‘టీవీకే’ (TVK) పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో, ఈ విడాకుల రచ్చ ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. తన భార్యకు నచ్చజెప్పి ఈ వివాదాన్ని సర్దుమణిగేలా చేస్తారా లేక భారీ భరణం చెల్లించి విడాకులు తీసుకుంటారా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ వ్యవహారం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
