సినిమా వార్తలు

బ్రతికుండగానే చనిపోయానంటూ ప్రకటించుకుంది,కారణం ఏంటంటే…

సోషల్ మీడియాలో సెగలు పుట్టించాలన్నా, కాంట్రవర్సీలతో దేశాన్నే షేక్ చేయాలన్నా అది ఒక్క పూనమ్ పాండేకే సాధ్యం. గ్లామర్ డాల్‌గా ఎంట్రీ ఇచ్చి, తన బోల్డ్ వేషాలతో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేసిన ఈ భామ, ఏకంగా తన చావునే పబ్లిసిటీ కోసం వాడుకుని అందరినీ విస్తుపోయేలా చేసింది. అసలు బతికుండగానే తాను చనిపోయినట్లు ప్రకటించుకుని, ప్రపంచాన్నే మభ్యపెట్టిన ఈ వింత నటి కథ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా పూనమ్ చేసిన ఆ పచ్చి అబద్ధం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో చూడాల్సిందే!

మరణ వార్తతో సెన్సేషన్.. 24 గంటల డ్రామా!

2024లో పూనమ్ పాండే పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దానికి కారణం ఆమె సినిమా కాదు.. ఆమె మరణ వార్త. సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) తో పూనమ్ చనిపోయిందంటూ ఆమె టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ అయింది. సెలబ్రిటీలంతా సంతాపం ప్రకటిస్తున్న తరుణంలో, అసలు ట్విస్ట్ బయటపడింది. ప్రకటన వచ్చిన మరుసటి రోజే పూనమ్ ప్రత్యక్షమై, “నేను బతికే ఉన్నాను” అంటూ వీడియో రిలీజ్ చేసింది. క్యాన్సర్‌పై అవగాహన కోసమే ఈ చావు డ్రామా ఆడానని చెప్పడంతో జనం పిచ్చెక్కిపోయారు. అవగాహన పేరిట ఇంతటి పబ్లిసిటీ స్టంటా అంటూ సోషల్ మీడియా విరుచుకుపడింది.

వరల్డ్ కప్ విప్పేస్తా.. అప్పట్లోనే అరాచకం!

పూనమ్ పాండేకు వివాదాలు కొత్తేమీ కాదు. 2011 క్రికెట్ ప్రపంచకప్ సమయంలో భారత్ గెలిస్తే తాను నగ్నంగా రోడ్లపైకి వస్తానని ప్రకటించి అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ఆ ఒక్క స్టేట్‌మెంట్‌తో ఈమె పేరు గూగుల్ సెర్చ్‌లో టాప్ లోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ‘నషా’ వంటి బోల్డ్ సినిమాలతో మెప్పించినా, సినిమాల కంటే సోషల్ మీడియాలో చేసే హంగామాతోనే ఈమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా తన అందచందాలతో ఊపు ఊపేసిన ఈ కాన్పూర్ బ్యూటీ, ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండటమే లక్ష్యంగా పెట్టుకుంది.

పెళ్లైన 11 రోజులకే పోలీస్ స్టేషన్ కు..

వ్యక్తిగత జీవితంలోనూ పూనమ్ పీక్ లోనే ఉంది. 2020లో తన ప్రియుడు సామ్ బాంబేను పెళ్లాడి, హనీమూన్ కోసం గోవా వెళ్ళింది. అయితే పెళ్లైన కేవలం 11 రోజులకే భర్త తనను కొడుతున్నాడని, బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసి అతడిని జైలుకు పంపించింది. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసిపోతున్నట్లు ప్రకటించి అందరి మైండ్ బ్లాక్ చేసింది. సినిమాటిక్ ట్విస్టుల కంటే పూనమ్ నిజ జీవితంలోనే ఎక్కువ ట్విస్టులు ఉండటం విశేషం.

పబ్లిసిటీ కోసం ఏదైనా..

ఏది ఏమైనా పూనమ్ పాండే అంటేనే ఒక కాంట్రవర్సీ ప్యాకేజీ. సర్వికల్ క్యాన్సర్ పేరుతో ఆమె ఆడిన నాటకం ఆమె ఇమేజ్‌ను దెబ్బతీసినా, ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ తగ్గలేదు. పుట్టినరోజు సందర్భంగా ఆమెను నెటిజన్లు విష్ చేస్తూనే, ఆ పాత చావు డ్రామాను గుర్తు చేసుకుంటున్నారు. పబ్లిసిటీ కోసం ప్రాణాలతో కూడా చెలగాటం ఆడే పూనమ్ పాండే, భవిష్యత్తులో ఇంకెన్ని వింతలకు తెరలేపుతుందో చూడాలి.

Similar Posts