సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ అంటే గ్లామర్, లగ్జరీ అనుకుంటే పొరపాటే. రంగుల ప్రపంచం వెనుక ఉన్న భయంకరమైన నిజాలను బయటపెడుతూ సీనియర్ నటి తనుశ్రీ దత్తా పేల్చిన బాంబు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది!

ఒకప్పుడు ‘ఆషిక్ బనాయా అపనే’ సినిమాతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టించిన తనుశ్రీ దత్తా, చాలా కాలం తర్వాత నోరు విప్పారు. ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త అమ్మాయిలకు కొందరు వేసే ఎరలు ఎలా ఉంటాయో చెబుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ అనే భూతం హీరోయిన్ల జీవితాలను ఎలా బలి తీసుకుంటోందో ఆమె పచ్చిగా వివరించారు.

అపరిచితుల చాక్లెట్లు.. అడల్ట్ ఆఫర్లు:

చిన్నప్పుడు మనకు తెలియని వారు చాక్లెట్ ఇచ్చి ఎలా లోబర్చుకుంటారో, ఇండస్ట్రీలో కూడా కొందరు పెద్ద మనుషులు అదే తరహాలో ‘చాక్లెట్లు’ ఆశ చూపుతారని తనుశ్రీ షాకింగ్ నిజాలు వెల్లడించారు. అవకాశాలు, ప్రశంసలు, రకరకాల వాగ్దానాలతో హీరోయిన్లను బుట్టలో వేసుకుని, చివరికి వారిని లైంగిక వాంఛలకు వాడుకుంటారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంప్రమైజ్ అయితేనే కెరీర్ ఉంటుందనే భ్రమలో పడి, ఎంతోమంది యువతులు చివరికి వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్నారని ఆమె బాంబు పేల్చారు.

నానా పటేకర్ నుంచి నగ్న డాన్స్ వరకు:

గతంలోనే నానా పటేకర్ వంటి స్టార్ హీరోపై మీటూ ఆరోపణలు చేసిన తనుశ్రీ, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తనను నగ్నంగా డాన్స్ చేయాలని బలవంతం చేశాడని గుర్తు చేసుకున్నారు. “నేను నటిని మాత్రమే, నా శరీరాన్ని ఎవరికీ అమ్ముకోను” అంటూ అప్పట్లో ఆమె తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. తన వద్దకు కాంప్రమైజ్ టాపిక్ తెచ్చిన ఒక నటితో కూడా ఫ్రెండ్‌షిప్ కట్ చేశానని చెబుతూ, ఈ మాయా ప్రపంచంలో పడొద్దని కొత్తవారిని హెచ్చరించారు.

తనుశ్రీ దత్తా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. రంగుల ప్రపంచంలో ఇలాంటి దారుణాలు జరగడంపై మీరేమంటారు?

#bollywood actress, #casting couch, #nana patekar, #Tanushree Dutta, #Vivek Agnihotri

By admin