టాలీవుడ్ హిస్టరీని తిరగరాసిన ‘శివ’ సినిమా వెనుక ఉన్న భయంకరమైన నిజాలు మీకు తెలుసా? సెట్‌లో ఉన్నది నటులు కాదు.. ఒరిజినల్ రౌడీ షీటర్లు! డైరెక్టర్ తేజ తాజాగా బయటపెట్టిన ఈ సీక్రెట్స్ వింటే ఎవరైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
తెలుగు సినిమాలో యాక్షన్ ట్రెండ్‌ను మార్చేసిన సినిమా ‘శివ’. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అప్పట్లో సినిమాలో నటించడానికి ఎక్కువమంది నటులు ఉండేవారు కాదు. దీంతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఆయన టీమ్ ఏకంగా ఒరిజినల్ గుండాలనే సెట్‌లోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో డైరెక్టర్ తేజ పడిన కష్టాలు, జరిగిన గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

పోలీస్ స్టేషన్ నుంచి షూటింగ్ స్పాట్‌కు:
షూటింగ్‌లో పాల్గొనే ఈ రౌడీలు ఇవాళ కనిపిస్తే రేపు మాయమైపోయేవారు. తీరా ఆరా తీస్తే ఏదో ఒక కేసులో పోలీస్ స్టేషన్‌లో ఉండేవారు. వాళ్లను బయటకు తీసుకురావడానికి తేజ గారు ఒక లాయర్‌ని వెంటబెట్టుకుని వెళ్లి, బెయిల్ ఇప్పించి మరీ సెట్‌కి పట్టుకొచ్చేవారట. అంతా రియల్ యాక్టర్స్ కావడంతో వాళ్లకు యాక్టింగ్ అంటే ఏంటో అస్సలు తెలీదు.

లెన్స్ పగిలిపోయే పంచ్:
ఒక సీన్‌లో భాగంగా కెమెరామన్ గోపాల్ రెడ్డి గారు “లెన్స్‌లోకి చూసి పంచ్ కొట్టు” అని ఒక రౌడీకి చెప్పారు. అంతే.. అతను తన చేతికున్న నకుల్ డస్టర్‌తో లెన్స్‌ని గట్టిగా కొట్టేశాడు. సరిగ్గా అదే సమయంలో లెన్స్ దగ్గర కన్ను పెట్టి ఉన్న కెమెరామన్‌కు అది తగలడంతో పరిస్థితి సీరియస్ అయిపోయింది. ఆగ్రహంతో గోపాల్ రెడ్డి గారు బూతులు తిట్టడంతో, ఆ రౌడీ ఎదురుతిరిగి “కొట్టమంటేనే కదా కొట్టాను” అని సీరియస్ అయ్యాడట. అప్పుడు తేజ గారు వెళ్లి “సార్ వద్దు.. తిట్టకండి, వాడు నిజంగానే కొట్టేస్తాడు” అని బ్రతిమలాడటంతో గొడవ సద్దుమణిగింది.
సినిమా కోసం ప్రాణాలకు తెగించి పని చేసిన ఆ రోజులు ఇప్పుడు వినడానికి గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ‘శివ’ సినిమాలోని ఆ రా ఫీల్ రావడానికి కారణం ఇదే కావచ్చు!

