సినిమా వార్తలు

పవన్‌తో బన్నీ కోల్డ్ వార్ నిజమేనా? ‘ఉస్తాద్’ ను ఇగ్నోర్ చేసి హిందీ సినిమాను లేపుతున్న ఐకాన్ స్టార్!

మెగా కాంపౌండ్‌లో చిచ్చు ఇప్పుడు బహిర్గతమైంది. చాలా కాలంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందన్న వార్తలకు తాజా పరిణామం బలాన్ని చేకూరుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హడావుడి నడుస్తుంటే, బన్నీ మాత్రం అవేమీ పట్టనట్లు బాలీవుడ్ సినిమా ‘దురంధర్ 2’ను ఆకాశానికెత్తడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పనిగట్టుకుని మరీ పవన్‌ను ఇగ్నోర్ చేశారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే..

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన హిందీ సినిమా ‘దురంధర్ 2’ చూసిన అల్లు అర్జున్, సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపించారు. రణ్‌వీర్‌ను ‘మై బ్రదర్’ అంటూ సంబోధిస్తూ, అతని నటన నిప్పు కణికలా ఉందని, సినిమా ఒక ‘షో రాకర్’ అని రివ్యూ ఇచ్చారు. అయితే, సరిగ్గా ఇదే రోజు పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకే ఇండస్ట్రీకి చెందిన పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు కనీసం విష్ చేయని బన్నీ, బాలీవుడ్ సినిమాను ఇంతలా లేపడం వెనుక ఉన్న వ్యూహం ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

సొంత పరిశ్రమలోని సినిమాను, పైగా తన కుటుంబానికే చెందిన పవన్ కళ్యాణ్ ప్రాజెక్టును పట్టించుకోకుండా.. ధురంధర్ 2 గురించి ఇంత భారీ స్థాయిలో స్పందించడం చూస్తుంటే ఇద్దరి మధ్య గ్యాప్ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. పనిగట్టుకుని మరీ ఉస్తాద్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండటం, తెలుగు హీరో అయ్యుండి బాలీవుడ్ సినిమాను ప్రమోట్ చేయడం వెనుక పవన్‌ను కావాలనే టార్గెట్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ చర్యతో బన్నీ తన వైఖరిని స్పష్టంగా చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది.

ఈ పరిణామం ఇప్పుడు మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్‌కు దారితీసింది. ఒక పక్క పవన్ కళ్యాణ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటే, మరోపక్క బన్నీ మాత్రం బాలీవుడ్ సినిమాను ఆకాశానికెత్తడం వెనుక ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ ఐక్యత గురించి అందరూ మాట్లాడుతున్న ఈ తరుణంలో, ఐకాన్ స్టార్ తీసుకున్న ఈ స్టాండ్ భవిష్యత్తులో మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య సంబంధాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. ఏది ఏమైనా, బన్నీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో మైండ్ బ్లాక్ చేస్తోంది.

Similar Posts