సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్ అంటేనే థియేటర్లలో బాంబు పేలినట్లే ఉంటుంది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’తో క్రియేట్ చేసిన రికార్డులను తిరగరాయడానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది, రంజాన్ కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది. ‘ధురంధర్ 2’ వంటి భారీ బాలీవుడ్ సినిమా పోటీలో ఉన్నప్పటికీ, పవర్ స్టార్ మేనియా ముందు అన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ రైట్స్ గురించి వినిపిస్తున్న వార్తలు ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే..

మైత్రీ మూవీ మేకర్స్ సుమారు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం, రిలీజ్‌కు ముందే 137 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. నైజాంలో 50 కోట్లు, ఆంధ్రాలో 54 కోట్లు అంటూ లెక్కలు తేలడంతో, ఉస్తాద్ లాభాల్లోకి రావాలంటే ఏకంగా 280 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే పవన్ హవా మామూలుగా లేదు. ఇండియాలో తొలిరోజే 20 కోట్ల పైగా అడ్వాన్స్ సేల్స్ జరగగా, ఓవర్సీస్‌లో కూడా డాలర్ల వర్షం కురుస్తోంది.

అయితే, ఇప్పుడు అందరి దృష్టి ఉస్తాద్ ఓటీటీ పార్ట్‌నర్ మీద ఉంది. తొలుత అమెజాన్ ప్రైమ్ రేసులో ఉన్నట్లు వినిపించినా, చివరి నిమిషంలో నెట్‌ఫ్లిక్స్ ఊహించని రేటుతో రంగంలోకి దిగింది. ట్రేడ్ టాక్ ప్రకారం, ఉస్తాద్ డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా 80 కోట్ల రూపాయల పైనే వెచ్చించినట్లు సమాచారం. థియేటర్లో రిలీజ్ అయిన ఐదు వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేయాలనే కండిషన్‌తో ఈ డీల్ కుదిరిందట. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో ఈ సినిమాను ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు. ఈ భారీ డీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కంటెంట్ పవర్‌ఫుల్‌గా ఉండటంతో పాటు పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, హరీశ్ శంకర్ మార్క్ డైలాగులు తోడవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్, దేవిశ్రీ ప్రసాద్ మాస్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఈ స్ట్రీమింగ్ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Similar Posts