ప్రపంచ సినిమా చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా ఒకే ఒక్క ట్రైలర్ సోషల్ మీడియాను ఊచకోత కోస్తోంది! 24 గంటల్లో 720 మిలియన్ల వ్యూస్ అంటే అది మామూలు విషయం కాదు.. అసలు ఈ ‘స్పైడర్ మ్యాన్’ మేనియా ఏంటి? బాక్సాఫీస్ దగ్గర రాబోతున్న ఆ 2 బిలియన్ డాలర్ల సునామీ ఏంటి?

హాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ నిన్న రిలీజ్ అయి గ్లోబల్ లెవల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ట్రైలర్ కేవలం ఒక రోజులోనే అన్ని ప్లాట్‌ఫామ్స్ కలిపి ఏకంగా 720 మిలియన్ల వ్యూస్ సాధించి వరల్డ్ రికార్డ్‌ను తిరగరాసింది. ఒక సినిమా ట్రైలర్‌కు ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం చూసి ట్రేడ్ అనలిస్టుల మైండ్ బ్లాక్ అవుతోంది.

ఇప్పటివరకు ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ రేంజ్ హైప్ రావడం చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వేట ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో వచ్చిన ‘నో వే హోమ్’ సినిమా 1.9 బిలియన్ డాలర్ల వసూళ్లతో ప్రపంచాన్ని షేక్ చేసింది. ఇప్పుడు ‘బ్రాండ్ న్యూ డే’ అంతకు మించి 2 బిలియన్ డాలర్ల మార్కును ఈజీగా టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ ఊపును గనుక కలెక్షన్లుగా మార్చగలిగితే బాక్సాఫీస్ లెక్కలన్నీ తలకిందులు అవ్వడం ఖాయం. జూలై 31న ఈ సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ట్రైలర్‌తోనే ఇంతటి విధ్వంసం సృష్టించిన స్పైడర్ మ్యాన్.. ఇక థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ పరిస్థితి ఏంటో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సెట్ అవ్వడానికి రంగం సిద్ధమైంది!

#Destin Daniel Cretton, #New World Record, #Spider-Man Brand New Day, #SPIDER-MAN: BRAND NEW DAY - Official Trailer, #Tom Holland

By admin