సినిమా వార్తలు

మూడు పెళ్లిళ్లు.. మూడు విడాకులు? వెనుక హీరోయిన్ వ్యక్తిగత చీకటి కోణాలు రివీల్!

ఒకప్పుడు తన అందచందాలతో వెండితెరను ఏలడమే కాకుండా, కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన ఆ హీరోయిన్.. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలోని చీకటి కోణాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది!

జేడీ చక్రవర్తి హీరోగా వచ్చిన ‘గోల్‌మాల్‌’ సినిమా గుర్తుందా? అందులో తన నటనతో, గ్లామర్‌తో మెప్పించిన మీరా వాసుదేవన్ ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. చాలా కాలం పాటు సైలెంట్‌గా ఉన్న ఈ నటి, తాజాగా తన విడాకులు, వ్యక్తిగత జీవితంపై చేసిన బోల్డ్ కామెంట్స్ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. తన విడాకుల విషయంలో నెటిజన్లు చేస్తున్న ప్రచారంపై స్పందిస్తూ, అసలు తన జీవితంలో ఏం జరిగిందో పబ్లిక్‌గా ఒప్పేసుకుంది.

మీరా వాసుదేవన్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల వ్యవహారంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. “నా గురించి తప్పుడు వార్తలు రాకూడదని, అపార్థాలు కలగకూడదనే ఉద్దేశంతోనే నేను విడాకులు తీసుకున్నానని, ప్రస్తుతం సింగిల్‌గా ఉంటున్నానని చెబుతున్నాను” అంటూ కుండబద్ధలు కొట్టారు.

సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ, “నాపై వచ్చే నెగటివిటీ నన్ను ఏమాత్రం బాధించదు. ఈ పరిణామాలు జరుగుతాయని నేను ముందే ఊహించాను. నా వైపు నుంచి కూడా కొన్ని తప్పులు జరిగాయి, వాటిని దాచాల్సిన అవసరం లేదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన మీరా, ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నానని తెలిపారు. తన అనుభవాల నుంచే జీవితంలో స్పష్టత వచ్చిందని, ప్రస్తుతం తన జీవితంలో ఒక అందమైన దశను అనుభవిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఇతరుల నుంచి గుర్తింపు కోరుకోవడం కంటే, మనకు మనమే కంఫర్ట్‌గా ఉండటం ముఖ్యమని ఆమె హితవు పలికారు.

ఏది ఏమైనా తన గతాన్ని ధైర్యంగా ఒప్పుకుంటూ మీరా వాసుదేవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గతాన్ని వదిలేసి కెరీర్ మీద ఫోకస్ పెట్టిన ఈ నటి, మున్ముందు మరిన్ని మంచి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం. మీరా వాసుదేవన్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి!

Similar Posts