“మొదటి సినిమా కదా.. ఇవన్నీ కామన్ అంటూ నా శరీర భాగాలను అసభ్యంగా తాకాడు, నా కుటుంబ సభ్యులు కళ్లముందే ఉన్నా ఆ కామాంధుడు అస్సలు తగ్గలేదు!” – ఇవి ఏదో సినిమా డైలాగులు కావు, ఒక వర్ధమాన నటి తనకి జరిగిన నరకాన్ని వివరిస్తూ గుండె పగిలేలా చెప్పిన నిజాలు.
గ్లామర్ ప్రపంచం వెనుక ఉన్న చీకటి కోణాలు మరోసారి బట్టబయలయ్యాయి. కుంభమేళా ఫోటోలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన మోనాలిసా, వెండితెరపై మెరవాలని కన్న కలలు మొదటి సినిమాతోనే చితికిపోయాయి. స్టార్ డైరెక్టర్ అని నమ్మి సినిమా ఒప్పుకుంటే, ఆ డైరెక్టర్ ఆమెకు చూపించిన సినిమా వేరేలా ఉంది. షూటింగ్ సెట్‌లోనే అందరి ముందే ఆమెను లైంగికంగా వేధిస్తూ నరకం చూపించిన ఆ డైరెక్టర్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నంలా రగులుతోంది.

నటి మోనాలిసాకు బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు. మొదట్లో అంతా బాగుందని నమ్మించిన సనోజ్, షూటింగ్ మొదలైనప్పటి నుంచి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మోనాలిసా మాట్లాడుతూ, షూటింగ్ సెట్‌లో తన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పటికీ సనోజ్ మిశ్రా ఏమాత్రం భయం లేకుండా తన బాడీ పార్ట్స్‌ను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు.
దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తే, “మొదటి సినిమా అంటే ఇలాగే ఉంటుంది, సర్దుకుపోవాలి” అంటూ చాలా తేలికగా సమాధానం ఇచ్చాడట. “మొదటి సినిమా అయితే ఏమైనా చేయొచ్చా? అసలు మొదటి సినిమా పేరుతో లైంగిక దాడి చేస్తారా?” అని ఆమె ఆవేదనతో ప్రశ్నించారు. ప్రస్తుతం సనోజ్ మిశ్రా వేరే ఒక లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే మోనాలిసా తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టడంతో ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
Allegations of pressure during shooting
— Telangana Ahead (@telanganaahead) March 25, 2026
Monalisa alleged that director Sanoj Mishra pressured her to act in inappropriate scenes#Monalisa #SanojMishra #Tollywood #Breaking pic.twitter.com/ibwDUheoU2
డైరెక్టర్ వేధింపులతో మానసికంగా కుంగిపోయిన మోనాలిసా, ఆ బాధ నుంచి కోలుకుని ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి పెడుతోంది. ఇటీవలే ఆమె నటుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ వివాదం సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, వేధింపులపై మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. బాధితురాలు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పడంపై నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

