బన్నీ ఫ్యాన్స్‌ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది ఆ వార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్‌కు అడ్డంకి ఎదురైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం AA22 (AA22xA6) షెడ్యూల్‌పై యుద్ధ మేఘాలు కమ్మేశాయి. దుబాయ్‌లో జరగాల్సిన కీలకమైన షూటింగ్ ఆగిపోవడంతో ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చ మొదలైంది.
దుబాయ్ షెడ్యూల్ ఎందుకు ఆగింది?
గత ఏడాది కాలంగా సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, ఇప్పటికే ముంబైలో వేసిన భారీ సెట్స్‌లో కీలక భాగాన్ని పూర్తి చేసుకుంది. ఈ ఏప్రిల్‌లో దుబాయ్ వేదికగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. అయితే, ఇరాన్ చుట్టుపక్కల నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు, భద్రతా కారణాల దృష్ట్యా ఈ దుబాయ్ షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ హఠాత్తుగా రద్దు చేసుకుంది. భారీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, ప్రస్తుతానికి ప్లాన్స్ మార్చుకున్నట్లు తెలుస్తోంది.
సైన్స్ ఫిక్షన్.. డబుల్ రోల్‌లో బన్నీ!
ఈ సినిమా గురించి వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది ఒక హై-స్కేల్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్. ఇందులో అల్లు అర్జున్ డబుల్ రోల్‌లో కనిపిస్తారనే వార్త ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో, సాయి అభ్యంకర్ సంగీతంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. వీరితో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా ఉండబోతున్నారనే గాసిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏప్రిల్ 8న అసలు వేట మొదలు!
షూటింగ్ వాయిదా పడినా, ఫ్యాన్స్‌కు అసలైన కిక్ ఇచ్చే అప్‌డేట్ మాత్రం సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అఫీషియల్ టైటిల్‌ను అనౌన్స్ చేయబోతున్నారు. దుబాయ్ కాకపోతే మరో ఇంటర్నేషనల్ లొకేషన్ కోసం టీమ్ సెర్చ్ చేస్తోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ తర్వాత సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి తెలియబోతోంది. మరి బన్నీ-అట్లీ కాంబో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి!

