చలన చిత్రం రేటింగ్: 3/5
దేశభక్తి సినిమాలు ఒకప్పుడు తెలుగు సినిమాకు ఒక ప్రత్యేకమైన జానర్. పెద్ద హీరోలు కూడా జాతీయ భావోద్వేగాలు, దేశ భద్రత, సైనిక నేపథ్యాలతో కథలు ఎంచుకునేవారు.అయితే గత కొన్నేళ్లుగా కమర్షియల్ ఫార్ములా మధ్య ఇలాంటి సినిమాలు అరుదయ్యాయి. ఆ నేపథ్యంలో సీనియర్ దర్శకుడు పి.ఎన్. రామచంద్రరావు తన రీఎంట్రీకి ఒక ప్రేమకథను ఎంచుకుని, దాని చుట్టూ ఉగ్రవాదం, జాతీయ భద్రత, దేశభక్తి అంశాలను అల్లి మన ముందుకు తీసుకొచ్చారు. అయితే ఒక సినిమాకు మంచి ఉద్దేశం సరిపోదు; ఆ ఉద్దేశం ఎంత బలంగా సినిమా రూపంలోకి మారిందన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు ‘పహల్గామ్ లవ్ స్టోరీ’ ఏ మేరకు సమర్దవంతంగా సమాధానం చెప్పిందో చూద్దాం.

కథ
ప్రేమలో ఉన్న సాగర్ (కృష్ణబాబు), చిత్ర (చిత్ర శుక్ల) కాశ్మీర్ వెళ్తారు. అక్కడ ప్రేమలో క్రిందా ,మీదా పడుతూ అక్కడి ప్రకృతి అందాలను కెమెరాలో బంధిస్తుంటారు.అయితే ఈ క్రమంలో అనుకోకుండా ఒక హత్య వారి కెమెరాలో రికార్డ్ అవుతుంది. ఈ హత్య వెనక ఓ టెర్రరిస్ట్ గ్రూప్ ఉంటుంది.
దాంతో ఆ ఫుటేజ్ తమ కుట్రను బయటపెట్టే ఆధారంగా మారుతుందని గ్రహించిన వారు సాగర్, చిత్రలను వెంబడిస్తారు. వారి బారి నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో సాగర్ ఇరుక్కుపోతాడు. చిత్ర తప్పించుకుంటుంది కానీ తన లవర్ ఇరుక్కుపోయాడని తెలుసుకుని వెనక్కి వచ్చి, అతన్ని బయిటకు తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది. ఆ క్రమంలో ఏమేమి విషయాలు బయిటపడ్డాయి. చివరకు ఏమైంది, సాగర్, చిత్ర ప్రేమ కథ ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాలి.

విశ్లేషణ
కాన్సెప్ట్ పరంగా ఇందులో సినిమాలో మంచి నాటు ఉంది. ఒక సాధారణ కెమెరా ఫుటేజ్ కథ మొత్తాన్ని నడిపించే Central MacGuffinగా పనిచేయడం ఇంట్రస్టింగ్ ఐడియా. హీరో, హీరోయిన్‌కు తెలియకుండానే వారు ఒక నేరానికి సాక్షులుగా మారడం కథకు వెంటనే ప్రమాదాన్ని, urgencyని తీసుకొచ్చి కథను పరుగెత్తించింది.
ఇది థ్రిల్లర్‌కు చాలా మంచి storytelling device. ఎందుకంటే కెమెరా ఫుటేజ్ ఎవరి చేతికి వెళ్తుంది? అందులో అసలు ఎంత కీలకమైన సమాచారం ఉంది? దాన్ని ఎవరు నాశనం చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు కథను ముందుకు నడుపుతాయి. అలాగే వెంటనే ఆ వీడియో బయటకు వస్తే ఎందుకు అంత పెద్ద ప్రమాదం? అందులో ఉన్న వ్యక్తి ఎవరు? ఏ కుట్ర బయటపడుతుంది? అనే అంశాలు మరింత stakes పెంచాయి.

అలాగే కాశ్మీర్ ట్రిప్ కూడా కేవలం songs, locations కోసం కాకుండా తర్వాతి కథకు visual setup కోసం చేయటం కూడా ఇంట్రస్టింగ్ గా అనిపించింది. కెమెరా, ఫొటోగ్రఫీ, వాళ్ల ప్రయాణం, వాళ్లు వెళ్లే ప్రదేశాలు.. ఇవన్నీ తర్వాత జరిగే మర్డర్‌కు ముందుగానే చిన్న చిన్న clues ఇవ్వగలిగితే screenplay మరింత sophisticated అయ్యేది. ఓవరాల్ గా కథ “ఫుటేజ్‌లో ఏముంది?” అనే mysteryగా కూడా మార్చి నడపటం బాగుంది.
అయితే స్క్రిప్ట్‌లో ప్రస్తుతం బలహీనతగా కనిపించేది విలన్. ఒక standard thrillerలో villain కేవలం క్రూరంగా కనిపించడం సరిపోదు. అతడికి Intelligence, Strategy, Ideology ఉండాలి. అది కొంత తగ్గిందనే అనిపించింది.

ప్లస్ పాయింట్స్
కథా కాన్సెప్ట్
కాశ్మీర్ బ్యాక్‌డ్రాప్
హీరోయిన్ పాత్ర
విజువల్స్
మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ లో టెన్షన్ తగ్గటం
క్లైమాక్స్ లో పే ఆఫ్ పూర్తిగా అవ్వలేదేమో అనిపించింది

సాంకేతిక విభాగం & నటీనటుల నటన
ఛాయాగ్రహణం: కాశ్మీర్ లోయల అందాలను వెండితెరపై దృశ్యకావ్యంగా ఆవిష్కరించడం సినిమాకి ప్రధాన బలం.
దర్శకత్వం: లవ్ స్టోరీకి దేశభక్తిని జోడించి, పి.ఎన్. రామచంద్రరావు ఎక్కడా ట్రాక్ తప్పకుండా డీసెంట్ థ్రిల్లర్‌గా మలిచారు.
నటీనటులు: కృష్ణబాబు, చిత్ర శుక్ల తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా సెకండాఫ్ లో చిత్ర ఎమోషనల్, యాక్షన్ సీన్స్‌లో బాగా చేసింది.
చూడచ్చా
ఓ దేశభక్తి సినిమాగానే కాకుండా ఓ థ్రిల్లర్ గా సినిమాని చూసి ఎంజాయ్ చేయచ్చు
