ప్రపంచ సినిమాకు విప్లవాత్మకమైన విజువల్ వండర్ ఇచ్చిన జేమ్స్ కామెరూన్ మళ్లీ ఒకసారి అద్భుతమైన మ్యాజిక్ చూపించబోతున్నారు. ‘అవతార్’ (Avatar), ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (The Way of Water)తో మంత్రముగ్ధులను చేసిన ఆయన, ఇప్పుడు మూడో పార్ట్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Ash)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేసి విజువల్ ఫీస్ట్ ఇచ్చిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. పండోరా ప్రపంచాన్ని ఎప్పటిలా మరింత గ్రాండియర్‌గా చూపించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈసారి జేమ్స్ కామెరూన్ పరిచయం చేసిన కొత్త తెగ ‘యాష్ పీపుల్’. వీరు అగ్ని పర్వతాల్లో నివసిస్తూ, ఫైర్‌ను ఆరాధించే, సైకోపాత్‌లా ఉండే భయంకరమైన వారు. వీరే పండోరాకు అతిపెద్ద ముప్పని ట్రైలర్ హింట్ ఇస్తోంది.

జేక్ సుల్లీ (Jake Sully) కుటుంబం, ముఖ్యంగా నేటిరీ (Neytiri), తమ కుమారుడు నెటియమ్ మరణం తర్వాత పడే వేదన ఈ సారి కథలో ప్రధాన ఎమోషన్‌గా మారనుంది. కుటుంబ బంధాలు, దుఃఖం, ప్రతీకారం – ఇవన్నీ కలిపి ఈ భాగాన్ని మరింత ఇన్‌టెన్స్‌గా మార్చబోతున్నాయన్న సంకేతాలు ట్రైలర్ ఇచ్చింది.

ట్రైలర్‌లో చూపించిన అగ్నిపర్వతాలు, లావా ప్రవాహాలు, కొత్త జీవులు – ఎప్పుడూ చూడని విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉన్నాయి. “ఈ ప్రపంచంలోని విషయాలు.. నువ్వు ఊహించిన దానికంటే లోతైనవి” అన్న డైలాగ్ ఇప్పటికే అభిమానుల్లో కిక్కు పెంచుతోంది.

సిగౌర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, ఊనా చాప్లిన్, క్లిఫ్ కర్టిస్, బ్రిటన్ డాల్టన్, ట్రినిటీ బ్లిస్, జాక్ ఛాంపియన్, బెయిలీ బాస్, కేట్ విన్స్లెట్ లాంటి హాలీవుడ్ స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19న విడుదల కాబోతున్న ఈ విజువల్ వండర్, తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో కూడా రానుంది. ఇండియన్ ఆడియన్స్ ఇప్పటికే ఈ మూవీ కోసం డేస్ కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు!

, , ,
You may also like
Latest Posts from