న్యాచురల్ స్టార్ నాని నటుడుగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్ అవుతున్నారు. ఆయన తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’. ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఓటిటి డీల్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. నాని ఎందుకు ఇలాంటి చిన్న సినిమాలు చేస్తున్నారనేదానికి సమాధానం దొరికింది అంటున్నారు.

ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓటీటీ డీల్ పూర్తయినట్లు తెలుస్తోంది.

‘కోర్ట్’ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లి్క్స్ రూ.9 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

రూ.9 కోట్లు అంటే, ఈ సినిమాకు ఇది సేఫ్ ప్రాజెక్టు అని చెప్పాలి. ఈ చిత్రాన్ని రూ.9 కోట్ల బడ్జెట్‌లోపే పూర్తి చేశారట చిత్ర యూనిట్. ఈ లెక్కన కేవలం ఓటీటీ రైట్స్‌తోనే నాని కు డబ్బులు వచ్చేసినట్లు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ నానికి లాభాలను తెచ్చిపెట్టనున్నాయి.

ఈ చిత్రాన్ని మార్చి 14న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో ప్రియదర్శి లాయర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిరినేని నిర్మిస్తున్నారు. అలాగే నాని సోదరి దీప్గి ఘంటా ఈ ప్రాజెక్ట్‌కు కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

కోస్టల్ ఏరియా, డాక్యుమెంట్స్, కోర్టు బోను, న్యాయ దేవత లాంటి విజువల్స్‌తో రూపొందించిన మోషన్‌ పోస్టర్ ఇప్పటికే సినిమా మీద మరింత క్యూరియాసిటీ రేపుతోంది.

కోర్టు గదిలో న్యాయవాదులు ఎలా తమ వాదనలతో ఉత్కంఠభరితమైన సస్పెన్స్‌ తో కోర్టు కేసును కొనసాగిస్తారో అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతోంది.

,
You may also like
Latest Posts from