తమిళ స్టార్ హీరో అజిత్ కు తెలుగులోనూ ఒకప్పుడు మంచి మార్కెట్ ఉండేది. ఇప్పుడు తెలుగులో మినిమం ఓపినింగ్స్ కూడా రావటం లేదు. విజయ్, కార్తీ వంటి స్టార్స్ ఇక్కడ దూసుకుపోతున్నారు. కానీ అజిత్ వెనకబడ్డారు. సర్లే తెలుగు మార్కెట్ కు ఏముందిలే అనుకుంటే ఇప్పుడు తమిళంలో కూడా సరైన ప్లానింగ్ తో రిలీజ్ చేస్తూండంతో అక్కడా క్రేజ్ క్రియేట్ కావటం లేదు.

అజిత్ కొత్త చిత్రం ‘విడాముయర్చి’ సంక్రాంతికి రావాల్సిన సినిమా. కానీ ‘బ్రేక్ డౌన్’ అనే హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి తీసిన విషయంలో అక్కడ నిర్మాతలు కేసులు గట్రా వేసి,సెటిల్మెంట్ చేసుకోవటానికి టైమ్ పట్టింది. ఈ కారణాలతో సినిమా వాయిదా పడింది.

అటు ఇటూ కానీ టైమ్ ఫిబ్రవరిలో ‘విడాముయర్చి’ రిలీజవుతోంది. ఈ టైంలో పిల్లలు చదువుల్లో, పరీక్షల్లో బిజీ అయిపోతారు.దాంతో వాళ్ల తల్లి తండ్రులు థియేటర్స్ కు రావటానికి ఇష్టపడరు. ఈ క్రమంలో ఓపెనింగ్స్ మీద ప్రభావం పడుతుందని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.

ఈ పిభ్రవరి నెలలో ఇవన్నీ గమనించే చిన్న, మిడ్ రేంజ్ చిత్రాలే రిలీజవుతుంటాయి . మామూలుగా అజిత్ సినిమాలకు ఉండే హైప్, అడ్వాన్స్ బుకింగ్స్ దీనికి కనిపించడం లేదు. ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ ఉన్నా సోషల్ మీడియాలో దీని గురించి పెద్దగా చర్చ లేకపోవటం అభిమానులను కంగారుపెడుతోంది.

ఇవన్నీ ఇలా ఉంటే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. విజయ్ చిత్రం ‘గోట్’తో పోలిస్తే బుకింగ్స్ చాలా డల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

అజిత్ సినిమా తెలుగు వెర్షన్ ‘పట్టుదల’ రిలీజవుతున్న సంగతే జనాలకు తెలియట్లేదు. ఇక్కడ ప్రమోషన్ లేదు.

,
You may also like
Latest Posts from