ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న క్రేజీ చిత్రాలో ఒకటి ‘ఫౌజీ’ ఒకటి.హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో రాబోతుంది. ఇందుతో ప్రధాన హీరోయిన్‌గా ఇమాన్వీ ఎంపికైంది. దర్శకుడు హను రాఘవపూడి తన గత చిత్రాల్లో ఎమోషనల్ బలాన్ని ఎంత అద్భుతంగా మలిచాడో మనకు తెలిసిందే. ఇక అదే విధంగా, ఇందులో కూడా చూపించబోతున్నాడని చెప్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడు పూర్తై, రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘ఫౌజీ’ చిత్రాన్ని 2026 వేసవి రిలీజ్ కు ప్లాన్ చేసారట. విఎఫ్ ఎక్స్ వర్క్ కు ఎక్కువ సమయం పడుతుందిట. గతంలో ఆదిపురుష్ విషయంలో గ్రాఫిక్స్, విఎఫ్ ఎక్స్ కు విమర్శలు రావటంతో ఆ విషయంలో కాస్త టైమ్ ఎక్కువైనా ఫర్వాలేదని, జాగ్రత్తలు తీసుకుని చేయమని ప్రభాస్ చెప్పటం జరిగిందిట.

ప్రస్తుతం హను రాఘవపూడి టీం ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో లీడ్ యాక్టర్లపై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తునున్నారట.

సీతారామం, రాధేశ్యామ్ లైన్‌లో వింటేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఫౌజీ సాగనుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడి పాత్ర పోషిస్తున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌.

ప్రభాస్‌ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్‌ 2 చేస్తున్నాడని తెలిసిందే. దీంతోపాటు సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో స్పిరిట్‌, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సినిమాలు కూడా చేస్తున్నాడు.

, , ,
You may also like
Latest Posts from