డైరక్టర్ మారుతి ఏ ముహూర్తాన్న ప్రభాస్ ది రాజాసాబ్ కోసం వర్క్ ప్రారంభించాడో అప్పుడే అతనిపై ఒత్తిడి మొదలైంది. అప్పటిదాకా చిన్న చిన్న కామెడీ సినిమాలు తీసుకునే మారుతి కు గేమ్ స్టార్టైంది. ఈ చిత్రం షూటింగ్ మొదలై చాలా కాలం అయ్యింది. ఇప్పటికి ఓ కొలిక్కి రాలేదు. ఎప్పటికి వస్తుందో కూడా తెలియని పరిస్దితి. ఈ సినిమా హారర్ కామెడీ కాబట్టి ఇది త్వరగా జరుగుతుందని భావించారు. దానికి తోడు మారుతీ తక్కువ వ్యవధిలో చిత్రాలను అందించడంలో కూడా పేరుగాంచాడు. కానీ, వివిధ కారణాల వల్ల, రాజాసాబ్ షూటింగ్ ఇంకా కొనసాగుతుంది.సాగుతోంది.

దానికి తోడు ప్రమోషన్ మెటీరియల్ కూడా పెద్దగా రెస్పాన్స్ లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రానికి సంబంధించి మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా దానికి ఓ మోస్త‌రు రెస్పాన్స్ వ‌చ్చింది.

ఈ సినిమాపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. రీషూట్‌లు జరుగుతున్నాయని, మెరుగైన అవుట్‌పుట్ కోసం VFX మార్పులు జరుగుతాయని చెప్తున్నారు.

దానికి తోడు ది రాజాసాబ్ తన కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం కాబట్టి మారుతిపై ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది.

ఇవన్ని ప్రక్కన పెడితే ప్రభాస్ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ కామెడీ సినిమాతో ప్రభాస్‌కు ఉన్న పాపులారిటీని పరిగణనలోకి తీసుకుని చేయాలి.

ఈ నెలాఖరున ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం.

ప్రభాస్ కు ఉన్న క్రేజ్, ఇమేజ్ దృష్ట్యా టీజర్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.

మారుతి చెప్పినట్లుగా, టీజర్ కట్‌తో, ముఖ్యంగా అందులోని విజువల్స్‌తో తనేంటో నిరూపించుకోవాలి.

మోషన్ పోస్టర్ మాదిరిగానే టీజర్ కూడా అంచనాలను అందుకోలేకపోతే మారుతీపై తీవ్ర విమర్శలు రావొచ్చు. ఇది సినిమాపై ఉన్న క్రేజ్‌పై కూడా ప్రభావం చూపుతుందనటంలో సందేహం లేదు.

, ,
You may also like
Latest Posts from