ప్రఖ్యాత నటుడు/చిత్రనిర్మాత ధనుష్ ఇప్పుడు తన కెరీర్ లో దూసుకుపోతుననారు. అటు దర్శకుడుగా, నటుడుగా,నిర్మాతగా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుంది అతని పరిస్దితి. తన బహుముఖ నైపుణ్యాలతో వరసపెట్టి సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఖచ్చితంగా, ధనుష్ కమిట్మెంట్స్ కు చాలా మంది హీరోలు మరియు ఇండస్ట్రీ వ్యక్తులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. తమిళ, తెలుగు హీరోలలో ఎవరూ ఆ స్దాయిలో వర్క్ చేయటం లేదు.
ధనుష్ నిరంతరం సినిమాలు చేస్తున్నాడు. అదే సమయంలో ఆ సినిమాలన్నీ మంచి క్వాలిటీతో ఉన్నాయి. ధనుష్ సినిమాల కోసం గ్యాప్ లేకుండా పనిచేస్తున్నాడు.
ఈ సంవత్సరం ధనుష్ దర్శకత్వం వహించిన NEEK(జాబిలమ్మ నీకు అంత కోపమా) గత నెలలో విడుదలైంది.
అలాగే, అతను శేఖర్ కమ్ముల యొక్క కుబేర సినిమా ఈ సంవత్సరం జూన్ మరియు ఆగస్టులో విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది.
ఇక ధనుష్ హీరోగా చేస్తున్న ఇడ్లీ కడై చిత్రం కీలక ఎపిసోడ్స్ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసాడు.
ప్రస్తుతం, ధనుష్ బాలీవుడ్ చిత్రం తేరే ఇష్క్ మేలో పనిచేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత కూడా ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా, అమరన్ దర్శకుడు రాజ్ కుమార్‌తో సైన్ చేసిన తన తదుపరి చిత్రం కోసం అతను సెట్స్‌పైకి వెళ్లబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ జూన్ నుండి ప్రారంభం కానుందని,
తదుపరి ఇళయరాజా బయోపిక్ కూడా పైప్ లైన్ లో ఉందని సమాచారం.