ఏడాదిన్నర క్రితం సెన్సేషనల్ రాంపెజ్ ను చూపించిన పాన్ ఇండియా మాస్ మూవీ సలార్(Salaar Movie), అయితే భారీ డిలే వలన అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది. అయినా కూడా ఉన్నంతలో 600 కోట్లకు పైగా గ్రాస్ ను దక్కించుకుంది. ఓటీటిలోనూ దుమ్ము దులిపింది. ఇప్పుడు రీరిలీజ్ లోనూ రచ్చ చేయబోతోంది.

ప్రభాస్ హీరోగా చేసిన ఈ భారీ యాక్షన్ అండ్ వైలెన్స్ చిత్రం ప్రభాస్ కెరీర్లో మరో రికార్డు గ్రాసర్ గా నిలిచింది. ఇక మళ్ళీ ఈ సినిమా ఇపుడు రీరిలీజ్ కి వస్తుండగా దీనికి సాలిడ్ ప్రీసేల్స్ కనిపిస్తున్నాయి.

ఈ మార్చ్ 21న సినిమా రాబోతుండగా బుకింగ్స్ ఎప్పుడో ఊపందుకున్నాయి. మరి ఈ బుకింగ్స్ ఇపుడు ఆల్రెడీ 1 కోటికి పైగా గ్రాస్ ని రాబట్టేయడం విశేషం.

రీసెంట్ గా మార్చ్ నెలలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసింది. ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఇండియాలో ఏమాత్రం తగ్గకుండా సలార్ సినిమా బుకింగ్స్ లో కుమ్మేస్తోంది. దీనితో సలార్ మ్యానియా ఇపుడు ఎలా ఉందో అనేది అర్ధం చేసుకోవచ్చు.

, , , , ,
You may also like
Latest Posts from