ప్రభాస్ (Prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit). పోలీస్ డ్రామాగా ఇది రానుంది. ఈ సినిమా ప్రారంభానికి ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో త్వరలోనే ‘స్పిరిట్’ అప్‌డేట్‌లు వరుసగా వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇంతకీ ‘స్పిరిట్’ చిత్ర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎప్పుడు?
స్క్రిప్ట్ సహా అన్ని పనులు పూర్తి చేసి సందీప్ రెడ్డి వంగా సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా లాక్ అయ్యి చాలా కాలం అయినా ఇంత వరకూ పట్టాలెక్కలేదు. ప్రభాస్ రాజా సాబ్, పౌజీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో? స్పిరిట్
ఆలస్యమైంది. అయితే ఇక ఎంత మాత్రం ఈచిత్రం ఆలస్యం కాబోదని తెలుస్తోంది. చిత్ర ప్రారంభోత్సవానికి ముహుర్తం పెట్టేసినట్లు తెలుస్తోంది.
ఉగాది సందర్భంగా చిత్రాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ పనులు పూర్త వ్వడంతో లాంచింగ్ విషయంలో డిలే లేకుండా ముందుకెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం గురించి గతంలో సందీప్ వంగా మాట్లాడుతూ.. తొలిరోజే ఇది రూ.150కోట్లు వసూళ్లు చేయడం ఖాయమని అన్నారు. ‘స్పిరిట్’లో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపిస్తారని చెప్పారు.
ఇప్పటివరకు ఆయన్ను గత 24 సినిమాల్లో ప్రేక్షకులు ఒకవిధంగా చూశారని.. ఈ చిత్రంలో మరో స్థాయిలో చూస్తారని హామీ ఇచ్చారు. ప్రభాస్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని ప్రశంసించారు. ఆయన్ని చూపించే విధానం ఆడియన్స్‌కు నచ్చితే చాలు.. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందన్నారు.