నితిన్ కోసం మరోసారి కామెడీ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ తో మన ముందుకు వస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. మార్చి 27న రాబిన్‌హుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తను వరస ఫ్లాఫ్ ల నుంచి బయిటపడాలనుకుంటున్నాడు. అందుకోసం హనుమాన్ దీక్ష కూడా తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా చెప్పాడు.
రాబిన్‌హుడ్ ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ ఓ ఇంటర్య్వూలో తాను రాబిన్‌హుడ్ మూవీ సక్సెస్ అవాలని హనుమాన్ దీక్ష తీసుకున్నట్టు తెలిపాడు. గతంలో కూడా నితిన్ పలుసార్లు హనుమాన్ మాల ధరించిన విషయం తెలిసిందే. కానీ ఈసారి నితిన్ హనుమాన్ దీక్ష మాత్రమే తీసుకున్నాడు. దానికి కారణం సినిమా ప్రమోషన్సే అని చెప్పాడు నితిన్.
మాల ధరిస్తే ఎప్పుడూ సేమ్ కాస్ట్యూమ్ లో ఉండాలని, ఇంటర్వ్యూ టైమ్ లో ఒకే కాస్ట్యూమ్ లో కనిపిస్తే పాత ఇంటర్వ్యూ అనుకుంటారని అందుకే ఈసారి కేవలం దీక్ష మాత్రమే తీసుకున్నానని నితిన్ తెలిపాడు.
కేవలం బట్టలు మాత్రమే నార్మల్ గా వేసుకుంటున్నానని, దీక్షకు, మాలకు నియమాలన్నీ సేమ్ అని, మూడు వారాల పాటూ తాను ఈ దీక్ష తీసుకుంటున్నానని నితిన్ తెలిపాడు.
తన తాతయ్య ఆంజనేయ స్వామికి చాలా పెద్ద భక్తుడని, చిన్నప్పుడు ఆయన ప్రతీ శనివారం తనను కూడా గుడికి తీసుకెళ్లేవారని, తన జయం సినిమాలో కూడా ఆంజనేయ స్వామి జెండా ఉంటుందని, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో అప్పట్నుంచి తాను ఆంజనేయ స్వామికి పెద్ద భక్తుడిగా మారానని నితిన్ చెప్పాడు.
ఆ తర్వాత నితిన్ శ్రీ ఆంజనేయం అనే సినిమాను కూడా చేసిన సంగతి తెలిసిందే.