రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్‌కు వెళ్లాడు. ఈ వెకేషన్‌లో ఆయన బస చేసిన హోటల్ స్టాఫ్ ఆయనతో కలిసి ఒక ఫోటో దిగారు. ఆ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ ధరించిన షర్టు ఎట్రో కంపెనీదని కాస్ట్ 85 వేల రూపాయలని నెటిజన్లు తేల్చారు.
జూనియర్ ఎన్టీఆర్ షర్టు చూసి, అలాంటి షర్టు దొరుకుతుందేమోనని చూసిన ఒక నెటిజన్, దాని రేటు ఏకంగా 85,000 రూపాయలని తెలిసి షాక్ అయ్యి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దాంతో ఈ పోస్ట్ క్రింద రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
కొంతమంది, “అది మా రెండు నెలల జీతం” అని కామెంట్ చేస్తుంటే, మరికొంతమంది, “జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ ఆ మాత్రం మెయిన్‌టైన్ చేస్తే తప్పేంటి?” అని కామెంట్ చేస్తున్నారు.
మొత్తంమీద, ఆ షర్టు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇక ఈ దుబాయ్ వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే, జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడు.