టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’. యావరేజ్ టాక్ తో ఓ మాదిరి కలెక్షన్స్ తో థియేటర్లలో రన్ అవుతోంది. హారర్ కామెడీ జానర్‌లో ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గవిరెడ్డి శ్రీనివాసరావు కీలక పాత్రలో మెప్పించగా, సమంత అతిథి పాత్రలో కనిపించారు.

సమంత స్వంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా నిర్మించిన ఈ చిత్రానికి టీజర్, ట్రైలర్ నుంచే పాజిటివ్ బజ్ వచ్చింది. కంటెంట్ పట్ల నమ్మకంతో… మే 9న థియేటర్లలో రిలీజ్ కాకముందే రెండు రోజుల ముందు ప్రీమియర్ షో వేశారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాపై స్పందించింది సమంత తల్లి నినెట్ రూత్ ప్రభు. సినిమాను చూసిన ఆమె తన కూతురు నటనపై తెగ మెచ్చుకుంది.

https://www.instagram.com/p/DJn7awJzyLD/?img_index=1

“నీ హావభావాలు చాలా బాగా వచ్చాయి. ఆ తరహా నటన తేలిక కాదు. సినిమా చూస్తున్నంతసేపూ కడుపుబ్బా నవ్వుకున్నాను” అని కామెంట్ చేశారు నినెట్.

ఈ ఎమోషనల్ మామెంట్‌ను వీడియో రూపంలో షేర్ చేసిన సమంత, తన తల్లి, డైరెక్టర్ రాజ్ నిడిమోరు, చిత్ర బృందంతో దిగిన ఫోటోలు, థియేటర్లలో ప్రేక్షకుల ఆనందోత్సాహం – అన్నింటినీ అభిమానులతో షేర్ చేసుకుంది.

“’శుభం’తో కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ఈ జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని ఎమోషనల్‌గా రాసింది సమంత.

ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకవైపు నిర్మాతగా తొలి అడుగు వేసి విజయాన్ని అందుకున్న సమంతకు… మరోవైపు తల్లి నుంచి వచ్చిన ప్రశంసలే పెద్ద రివార్డ్ అంటోంది.

,
You may also like
Latest Posts from