మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న మూవీ విశ్వంభర. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఓ సోషియో ఫాంటసీ మూవీ. దాంతో ఈ మూవీలో భారీగా వీఎఫ్ ఎక్స్ వాడతారు అనేది నిజం. అయితే ఆ వీఎఫ్ ఎక్స్ కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వార్తలు మొదలయ్యాయి. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ప్రముఖ వీఎఫ్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కూడా జరిగిపోయిందంట. ఈ వార్త అంతటా బాగా స్ప్రెడ్ అయ్యింది. అయితే ఇందులో నిజమెంత అని సోషల్ మీడియా జనం డిస్కషన్స్ మొదలెట్టారు.
ఎందుకంటే ఓ తెలుగు సినిమాకి కేవలం వీఎఫ్ ఎక్స్ కే ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. కానీ బడ్జెట్ లో సగం పైగా విఎఫ్ ఎక్స్ కే ఖర్చు పెడితే ఇక చిరంజివీ వంటి మెగాస్టార్ కు రెమ్యునరేషన్ ఏమి ఇస్తారు.
మిగతా ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్, సెట్స్, మిగతా ఖర్చులు మాటేంటి, అంత పెట్టుకుంటూ వెళ్తే ఆ స్దాయి మార్కెట్ అవుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం.
అలాగే ఈ వార్త ఇంతలా స్ప్రెడ్ అవ్వటం వెనక సినిమాకు సంభందించిన పీఆర్ ఉందని అంటున్నారు. సినిమాకు క్రేజ్ తేవటానికి, బిజినెస్ హైప్ చేయటానికి ఇలాంటి న్యూస్ లు రాయిస్తున్నారని మరికొందరు అంటున్నారు. అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
ఏదైమైనా ఈ మూవీ సోషియో ఫాంటసీగా వస్తోంది. ఈ లెక్కన మూవీలో భారీగానే వీఎఫ్ ఎక్స్ ఖర్చు చేస్తారనేది నిజం. ఇప్పటికే షూటింగ్ దాదాపు చివరకు వచ్చేసింది. జులై నెలలో దీన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా.. వీఎఫ్ ఎక్స్ పనుల కారణంగానే ఆలస్యం అయింది. రీసెంట్ గానే రామ రామ అనే పాటను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. త్వరలో మూవీ నుంచి వరుస అప్డేట్లు వస్తాయనే టాక్ వినిపిస్తోంది.