హీరోయిన్ మాళవికా మోహనన్‌ తెలుగువారికి సైతం పరిచయమే. ఆమె రీసెంట్ గా ‘తంగలాన్‌’ సినిమాతో ఇక్కడా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ‘రాజా సాబ్‌’, ‘సర్దార్‌ 2’ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా దృష్టి పెడతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాళవికా మోహనన్‌ 2013లో మలయాళ చిత్రం ‘పట్టం పోల్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత పలు తమిళం, హిందీ చిత్రాల్లో నటించింది.

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విజయ్ హీరోగా 2021లో వచ్చిన ‘మాస్టర్’ మూవీతో తెలుగువాళ్లకూ పరిచయమైంది. ఆ తర్వాత రజనీకాంత్ పెట్టా, ధనుష్ మారన్, విక్రమ్ తంగళాన్ సినిమాల్లో నటించి అలరించింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ ది రాజా సాబ్’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవికా మోహనన్ సౌత్ సినిమాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ నాభి చూపించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారని చెప్పింది.

మాళవికా మోహనన్‌ మాట్లాడుతూ… ‘దక్షిణాది సినిమాల్లో నేను నటిస్తున్నాను. ఆ సినిమాల గురించే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను . ముఖ్యంగా నేను ముంబైలో పెరిగా కాబట్టి, దక్షిణాది సినిమాల గురించి నా కెరీర్ మొదట్లో నాకు పెద్దగా అవగాహన లేదు.

కానీ, దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల నాభి, నడుము చూపించడానికి డైరెక్టర్లు ఎక్కువగా ఇష్టపడతారు అని ఆ తర్వాత అర్ధం అయింది. నాకు ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది. హీరోయిన్ల ఫొటోలు చూసేటప్పుడు కూడా వారి శరీర భాగాలను జూమ్ చేసి మరీ చూస్తారు. అందులోనూ నాభిని ఎక్కువగా చూస్తారు’ అంటూ మాళవికా మోహనన్‌ తెలిపింది.

, , , ,
You may also like
Latest Posts from