బిగ్ బాస్ బ్యూటీ, నటి అషూరెడ్డికి లాస్ట్ ఇయిర్ బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. సర్జరీ నుంచి కోలుకుంటున్న ఆమె షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్‌లో తన సర్జరీకి సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియోను పంచుకుంది.
“ఇదే కదా జీవితమంటే.. దయచేసి ఇతరుల పట్ల దయతో ప్రవర్తించండి. ఎగిరెగిరి పడకుండా ఒదిగి ఉండటం నేర్చుకోండి. దాని వల్ల చాలా మంది బాగుపడతారు” అని క్యాప్షన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సర్జరీ అయిన తర్వాత తాను రికవరీ అవ్వడానికి చేసిన ప్రయత్నాలు, జిమ్, యోగా చేసినవి.. తిరిగి కెమెరా ముందుకు వచ్చిన వీడియోలని కూడా అషూ పంచుకుంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, సెలబ్రెటీలు అషూరెడ్డి గురించి కామెంట్లు పెడుతున్నారు.
నువ్వు చాలా స్ట్రాంగ్ గర్ల్, నువ్వు మేము అనుకున్న దానికన్నా మానసికంగా బలమైనదానివి, తట్టుకోగలిగిన వాళ్లకే దేవుడు కష్టాలు ఇస్తాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఓ షోలో ఇటీవల పాల్గొన్న అషూ రెడ్డి తన బ్రెయిన్ సర్జరీ గురించి వివరిస్తూ భావోద్వేగానికి గురైంది. ఆపరేషన్ సమయంలో తలపై జుట్టు తీసేశారని, అదేదో పూర్తిగా తీసేసినా బాగుండేది కానీ అరగుండు చేశారని బాధను వ్యక్తం చేసింది. ఆ సమయంలో అద్దంలో తన ముఖం చూసుకుని ఇక కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నానని కన్నీళ్లు పెట్టుకుంది.
డబ్‌స్మాష్ వీడియోలతో పాప్యులర్ అయిన అషూ రెడ్డి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక్కసారిగా హైలైట్ అయ్యారు.
ఆ క్రమంలోనే బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొనడంతో పాటు ఆ తర్వాత ఓటీటీలో బిగ్ బాస్ నాన్‌స్టాప్ సీజన్‌లోనూ అవకాశం దక్కించుకుంది. చల్ మోహన్ రంగ, బాయ్ ఫ్రెండ్స్ ఫర్ హైర్, ఏ మాస్టర్ పీస్ మూవీల్లో నటించింది.