నందమూరి బాలకృష్ణ అంటేనే మాస్‌కు మంత్రం. బోయపాటి శ్రీను దర్శకత్వం అంటేనే రక్తం మరిగే యాక్షన్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఒకదానిపై ఒకటి విజయాల పర్వతాలను అధిరోహించాయి. ఇప్పుడు అదే లెవెల్‌ను దాటేసేలా ‘అఖండ 2: తాండవం’ ప్రిపేర్ అవుతోంది.

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం బిజినెస్ పరంగా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గేమ్‌చేంజర్ అవుతోంది.

100 కోట్ల క్లబ్‌ను తలకిందులు చేసిన అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్!

ఇప్పటికే ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి.
ఇందులో ముఖ్యంగా

▶ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రూ. 120 కోట్ల మార్క్‌ను దాటి వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
▶ బాలయ్య కెరీర్‌లో ఇంత భారీ బిజినెస్ చేయగలిగిన మొదటి సినిమా ఇదే!
▶ నాన్-తెలుగు మార్కెట్లలోనూ మంచి డిమాండ్ ఉంది.

బాలయ్య–బోయపాటి కాంబో మీద నమ్మకం, ‘అఖండ’ సినిమాతో ఏర్పడిన మాస్ కల్ట్ ఫాలోయింగ్… ఇవన్నీ కలిసీ ఈ సినిమాకి హైప్ తీసుకొచ్చాయి.

అఖండ అవతారంలో బాలయ్య తాండవం – మాస్‌కు మత్తుగా మారిన టీజర్!

ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌తో బాలయ్య మళ్లీ మాస్‌లో సెగలు పుట్టించారు. శివ తాండవ మంత్రం నేపథ్యంలో త్రిశూలంతో కనిపించిన బాలయ్య లుక్… థియేటర్‌లో పట్టు కోసేలా ఉందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. థమన్ మ్యూజిక్, సి. రామ్ ప్రసాద్ విజువల్స్, సంయుక్త మీనన్ గ్లామర్, ఆది పినిశెట్టి విలనిజం – అన్నీ కాంబైనై మాస్‌ను మైమరపించబోతున్నాయి.

దసరా కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్!

ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. మాస్ సినిమా అంటే ఫెస్టివల్ రిలీజ్ – అందుకే దసరా స్పెషల్‌గా సెప్టెంబర్ 25న భారీ థియేటర్ రెలీజ్ ప్లాన్ చేశారు.

బాలయ్య మార్కెట్ రేంజ్ చూపించే సినిమా ఇదే!

‘అఖండ 2’తో బాలయ్య సొంత మార్కెట్‌ను ఓ రేంజిలో ప్యాన్ ఇండియా స్దాయిలో చూపించబోతున్నారు. ఈ సినిమాతో థియేట్రికల్ బిజినెస్ పరంగా బాలయ్యకు పాన్ ఇండియా స్థాయి బలమైన మార్కెట్ ఉన్నదని మరోసారి రుజువు కాబోతోంది.

, , ,
You may also like
Latest Posts from