జాన్ అబ్రహామ్ తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, కథలు ఎంచుకుని అభిమానులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఆయన ఎంచుకునే పాత్రలు కొంత ప్రత్యేకతను పెంచుతున్నాయి.
తాజాగా ఆయన నటించిన చిత్రం “ది డిప్లొమాట్” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఇప్పువడు ఈ సినిమా OTT లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. అక్కడ మంచి స్పందనను పొందే అవకాశం ఉంది.
భారత్-పాకిస్థాన్ నేపథ్యంలో ఒక రాజకీయ స్పై థ్రిల్లర్ గా అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం, దౌత్య పరమైన సంక్లిష్టతను వివరిస్తుంది.
ప్రేక్షకులకు థ్రిల్, సస్పెన్స్, యాక్షన్ డ్రామా లతో మంచి ఎక్సపీరియన్స్ ఇస్తూ ఈ చిత్రం రూపొందింది. జాన్ అబ్రహమ్, ఒక భారతీయ డిప్లొమాట్ పాత్రలో, తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు.
సాంకేతికంగా సినిమా బాగుంది. ‘స్పెషల్ ఓపీఎస్’, ‘ముక్బిర్: ది స్టోరీ ఆఫ్ స్పై’వంటి ఓటీటీ కంటెంట్‌తో అలరించిన దర్శకుడు శివమ్ నాయర్ ‘ది డిప్లొమాట్’లోనూ తన మార్క్ టేకింగ్‌ను చూపించారు.
“ది డిప్లొమాట్” Netflix లో 9 మే నుండి ప్రీమియర్ అవనుంది, ఆఫ్-థియేటర్ ప్రేక్షకులకు ఈ సినిమాను ఎంజాయ్ చేయడానికి మరో అవకాశం ఇచ్చింది.