

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కాంతార చాప్టర్ 1. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమా పంపిణీ, ఇతర వ్యాపారాలను స్టార్ట్ చేయనుంది. ఈ నేపధ్యంలో ఓటిటి రైట్స్ డీల్ క్లోజ్ అయ్యింది.
అక్టోబర్ 2, 2025న విడుదల కానున్న కాంతారా: చాప్టర్ 1 చుట్టూ భారీ హైప్ నెలకొంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం, హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో వస్తూ, 2022 బ్లాక్‌బస్టర్ కాంతారా కి ప్రీక్వెల్‌గా రూపొందింది. తీర కర్ణాటకలోని “భూత కొల” సంప్రదాయ ఆరంభాలను ఈ సినిమా విపులంగా చూపించబోతోంది.
ఇండస్ట్రీ ట్రాకర్ హిమేష్ మాంకడ్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రైమ్ వీడియో ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏకంగా ₹125 కోట్ల భారీ డీల్ తో సొంతం చేసుకుంది. ఇది కన్నడ సినిమాల్లో రెండవ అతిపెద్ద డీల్‌గా నిలిచింది – మొదటిది KGF: Chapter 2 . అన్ని భాషల్లో రైట్స్ తీసుకోవడంతో, సినిమా విస్తృతంగా ప్రేక్షకులను చేరుకోనుంది.
అయితే, ఈ పెద్ద డీల్‌పై కొంతమంది అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి వాదన – “నెట్‌ఫ్లిక్స్ అయితే అంతర్జాతీయ స్థాయిలో కాంతారా స్థాయిని మరింతగా పెంచేది. కథలోని సంస్కృతిక లోతు, గ్లోబల్ పొటెన్షియల్‌కి నెట్‌ఫ్లిక్స్ సరైన వేదిక” అని.
సెప్టెంబర్ 20 ప్రాంతంలో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 VFX స్టూడియోలు ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాయి. హిందీ రిలీజ్ ను అనిల్ థడానీ (AA Films) డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, తద్వారా నార్త్ ఇండియాలో కూడా బలమైన ప్రెజెన్స్ ఏర్పడనుంది.
మిథాలజికల్ రూట్స్, భారీ ప్రొడక్షన్ విలువలు, రిషబ్ శెట్టి క్రియేటివ్ విజన్ – ఇవన్నీ కలిసివచ్చి కాంతారా: చాప్టర్ 1 ను 2025లో తదుపరి ₹1000 కోట్లు వసూలు చేసే పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ గా మలుస్తాయనే అంచనాలు ఉన్నాయి.