రజినీకాంత్ + లోకేశ్ కనగరాజ్ – ఈ ఇద్దరిదీ వేరే లెవల్. ఒకవైపు ఫ్లేవర్ ఫుల్ మాస్‌, మరోవైపు టెక్నికల్ మాస్టర్ పీస్‌. ఈ కాంబినేషన్‌కి తోడు భారీ స్టార్ కాస్ట్‌, పవర్‌పుల్ ఎమోషన్స్‌, మాస్ యాక్షన్ డ్రామా – ఇలా అన్ని మాస్ ఫాక్టర్స్ కలిసొచ్చాయి. అందుకే ‘కూలీ’ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇప్పుడు ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ గురించి వినగానే ట్రేడ్ వర్గాలు నోరెళ్లబెట్టాయి!

₹80 కోట్లు MG డీల్ – షాకింగ్ బట్ ట్రూ!

‘కూలీ’ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం నిర్మాతలు రూ.80 కోట్లు ప్లస్ ధరను అడిగారని, అంతే స్థాయిలో ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఆఫర్ చేసాడని సమాచారం. ఇది షాకింగ్ విషయం ఏంటంటే, ఈ డీల్ అడ్వాన్స్ బేసిస్ మీద కాదు… MG (Minimum Guarantee) బేసిస్ మీదనే ఫైనల్ అవుతోంది. అంటే సినిమా లాభాల్లో పోతే బాగుంటుంది, కానీ నష్టాలుంటే అన్ని డిస్ట్రిబ్యూటర్ భాద్యత!

ప్రొడ్యూసర్లకి నో టెన్షన్ – ఫుల్ రిస్క్ డిస్ట్రిబ్యూటర్‌దే!

ఇలాంటి డీల్ అంటేనే ట్రేడ్‌లో షాక్‌. కానీ అదే సమయంలో ‘కూలీ’ మీద ఎంత నమ్మకముందో కూడా చూపిస్తోంది.

క్రేజ్‌కి కారణాలు:

రజినీకాంత్ పూర్తిగా మాస్ అవతారంలో కనిపించబోతున్నారు.

లోకేశ్ స్టైల్‌లో రా యాక్షన్, ఎమోషనల్ డెప్త్ ఇద్దరి ఫ్యాన్స్‌కి పండగే.

కథ, టేకింగ్‌కి సంబంధించి ఎలాంటి లీక్ లేకుండా పాజిటివ్ సస్పెన్స్ ఉంచారు.

ఫస్ట్ సింగిల్‌ ఈ వారం విడుదల కాబోతోంది – ఆ సాంగ్ బజ్‌తో హైప్ ఇంకాస్త పెరిగే ఛాన్స్.

ట్రేడ్ లో వినిపిస్తున్న మాట –

“ఈ సినిమా రెగ్యులర్ సక్సెస్‌ కూడా కాదు… ఇది బాక్సాఫీస్ బాంబ్, కొత్త బెంచ్‌మార్క్ సెట్టర్ అవ్వబోతోంది!”

ఒక మాటలో చెప్పాలంటే –

“కూలీ” సినిమా ఓవర్సీస్ రేంజ్‌లో 80 కోట్లు పెట్టేంత క్రేజ్ అంటే, రజినీ–లోకేశ్ కాంబో స్టామినా ఇప్పుడే హైలైట్ అవుతోంది!

, , , ,
You may also like
Latest Posts from