బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హేరాఫేరీ 3’ చిత్రం, వివాదాల్లో చిక్కుకుంది. ఈ సిరీస్‌కు మర్చిపోలేని ఫన్ అందించిన పరేష్ రావల్ (బాబురావ్) ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

ఇంతలో ఈ కథకు మలుపు ఆశ్చర్యపరిచేలా మారింది — అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ ‘కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్’ పరేష్ రావల్‌కు రూ.25 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు జారీ చేసింది!

ఒప్పందం ఉల్లంఘనపై న్యాయపోరాటం

పరేష్ రావల్ ఒప్పందంపై సంతకం చేసి, ఒకరోజు షూటింగ్‌లోనూ పాల్గొని, ముందస్తు రెమ్యునరేషన్ తీసుకున్న తర్వాత ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గడం వ్యాపారపరంగా పెద్ద నష్టం కలిగించిందని సంస్థ ఆరోపిస్తోంది.

తన రెగ్యులర్ పారితోషికం కన్నా మూడు రెట్లు ఎక్కువగా చెల్లిస్తున్నామని నిర్మాత వర్గాలు చెప్తున్నాయి. “వృత్తిపరమైన నైతికతను విస్మరించారు. హాలీవుడ్‌లో లాగే, ఇక్కడ కూడా నటీనటుల ప్రవర్తనకు బాధ్యత ఉండాలి” అంటూ తేల్చారు.

పరేష్ రావల్ హేరాఫేరీ నుంచి తప్పుకోవడంపై సోషల్ మీడియాలో “No Baburao, No Hera Pheri” అనే కామెంట్లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. “ఒక బాబురావు పాత్రే సినిమాను ఓ బ్రాండ్‌గా మార్చింది. ఆయన లేకుండా ఈ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?” అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఏప్రిల్‌లో ప్రియదర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఫిరోజ్ నదియాడ్‌వాలా నుంచి హక్కులు కొనుగోలు చేసిన అక్షయ్ కుమార్, ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైన నేపథ్యంలో, పరేష్ రావల్ స్థానంలో మరొకరిని తీసుకుంటారా లేదా ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ లీగల్ యుద్దం ఎలా ముగుస్తుందో తెలియదు. కానీ, హేరాఫేరీ ఫ్రాంచైజీ భారత హాస్య ప్రపంచంలో అక్షరాలా ఒక లెజెండ్.
బాబురావ్ పాత్రలో పరేష్ రావల్ తిరిగి కనిపిస్తేనే ప్రేక్షకులు ఆనందపడతారు.

బాబురావ్ లేకుండా హేరాఫేరీ 3 చూస్తారా?
కామెంట్స్‌లో మీ అభిప్రాయం చెప్పండి!

, ,
You may also like
Latest Posts from