ప్రారంభానికి ముందే సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు సృష్టిస్తోంది అల్లు అర్జున్ – అట్లీ చిత్రం (AA22). ఈ చిత్రం సెట్లపైకి రాకముందే ఆల్రెడీ హంగామా చేస్తోంది. ఇప్పుడు ఆ హంగామాని రెట్టింపు చేసేలా ఈ సినిమాలోకి హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ రాబోతున్నారనే వార్త మైండ్ బ్లాక్ చేస్తోంది.
ఈ సినిమా భారతీయ సినిమాల్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రాలలో ఒకటిగా చెప్పబడుతోంది. అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా లక్ష్యంగా పెట్టుకుని తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌తో ఎప్పటిలాగే టాప్ లెవిల్ టాలెంట్స్ కలిసి పనిచేస్తున్నారు.
హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ స్కోర్ చేస్తారు
ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు హాన్స్ జిమ్మర్ ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తారని తాజా సమాచారం. పుష్ప 2 సినిమా వంటి తాజా ట్రెండ్‌ను అనుసరించి, ఒకే సినిమాలో బహుళ సంగీత దర్శకులు పాల్గొనడం ఇప్పుడు హిట్ ఫార్ములాగా మారింది. అందులో ఒకరు హాన్స్ జిమ్మర్ ఉండటం AA22 కి మరింత గ్లోబల్ క్రేజ్ తెచ్చిపెడుతుందని అంచనా.
అల్లు అర్జున్ – మూడు పాత్రల్లో
ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. దీపికా పదుకోణే, మృణాళ్ ఠాకూర్, జాహ్నవి కపూర్ లాంటి ప్రముఖ నటి-నటులు కీలక పాత్రల్లో ఉంటారు.
యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్
ఇప్పటికే ఈ సినిమాకి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ను కూడా ప్రకటించారు. ఈ సౌండ్ టీం మొత్తం సినిమాకు అద్భుతమైన మ్యూజికల్ ఎక్స్ పీరియన్స్‌ను అందించనుంది.
AA22 ప్రాజెక్ట్ ఇప్పటికే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హైప్‌ను క్రియేట్ చేసింది. ఇప్పుడు హాన్స్ జిమ్మర్ చేరికతో, ఈ చిత్రం అంతర్జాతీయ నైపుణ్యాలతో భారీ విజయాలు సాధించే అవకాశం మరింత పెరిగింది.